జగన్‌ వైపు చూస్తున్న ఏపీ నిరుద్యోగులు !

తెలంగాణ సీఎం కేసీఆర్ 90వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీని ప్రకటించారు. ఇప్పుడు అందరూ ఏపీ వైపు చూస్తున్నారు. సీఎ జగన్ కూడా అలాంటి బహుబలిని మించిన ఉద్యోగాల ప్రకటన చేస్తారని ఆశిస్తున్నారు. అధికారంలోకి రాగానే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని అలాగే.. ప్రతీ ఏడాది జనవరిలో ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ రూ. ఐదు వేలు ఇచ్చే వాలంటీర్లను.. రూ. పదిహేను వేలు ఇచ్చే సెక్రటేరియట్ ఉద్యోగాలను భర్తీ చేశారు. మరో ఉద్యోగం భర్తీ చేయలేదు. నిరుద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో చివరికి గత ఏడాది జూన్‌లోఓ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు.

సీఎం జగన్ ప్రకటించిన ఆ జాబ్ క్యాలెండర్ ను చూసి యువత ఆవేశంతో రగిలిపోయింది. లక్షల్లో జాబ్స్ వస్తాయని నిరుద్యోగులు ఎదురు చూస్తున్న సమయంలో మొత్తంగా పదివేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. ఇందులోనూ గ్రూప్ వన్, టు ఉద్యోగాలు 50 కూడా లేవు. గ్రూప్ వన్.. టు ఉద్యోగాల కోసమే నిరుద్యోగులు పెద్ద ఎత్తున కష్టపడుతూంటారు. నోటిఫికేషన్లు వస్తాయని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూంటారు. ఇప్పుడు ఇచ్చిన ప్రకటన చూసి.. వారు నిరాశపడ్డారు. ఉద్యమం చేశారు. పోలీసు ఉద్యోగాల కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టుల నోటిఫికేషన్ల కోసం చూస్తున్నారు. ఆరేడు వేల పోస్టులుఏడాదికి భర్తీ చేస్తామని గతంలో జగన్ హామీ ఇచ్చారు. చివరికి నాలుగు వందల పోస్టులు మాత్రమే చూపించారు.

ప్రభుత్వం లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చమని రూ. కోట్లు పెట్టి ప్రచారం చేసుకుంటోంది. వాలంటీర్లు.. కోవిడ్ తాత్కాలిక ఉద్యోగాలు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు మాత్రమే ఉద్యోగులను ఈ లెక్కలో చూపిస్తోంది. వారంతా ఉద్యోగులు ఎలా అవుతారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకాం రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కొసమెరుపేమిటంటే.. ప్రకటించిన ఆ అరకొర జాబ్ క్యాలెండర్ పోస్టుల్ని కూడా భర్తీ చేయడానికి క్యాలెండర్ ప్రకారం ముందుకు వెళ్లడంలేదు. సగానికిపైగా పోస్టులలకు కాలం గడిచిపోయినా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏపీ సర్కార్ తీరు నిరుద్యోగుల్ని అవమానించేలా ఉండటంతో వారంతా మండి పడుతున్నారు. సీఎం కేసీఆర్‌ను చూసైనా .. మేనిఫెస్టోలో హమీ ఇచ్చినట్లుగా రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close