మబ్బులు తేలిపోతున్న స్కిల్ కేసు – వ్యవస్థలు సిగ్గుపడతాయా ?

ఏపీలో అసలు జరగని స్కిల్ స్కాంతో ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని.. .. అరెస్ట్ చేసిన వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేయడంలోనూ… వైసీపీ నేతలు, సీఐడీ, ఏఏజీ లాంటి వ్యవస్థలు కూడా తేలిపోతున్నారు. తాము అబద్దాలు చెబుతున్నామని అడ్డగోలుగా దొరికిపోతున్నారు. మరో వైపు తెలుగుదేశం పార్టీ… అసలు స్కిల్ కేసు నిజాలతో పూర్తి వెబ్ సైట్ ను ప్రారంభించింది. అందులో డాక్యుమెంట్ సహితంగా ప్రతీ దానికి ఆధారాలు ఉన్నాయి.

చిన్న ఆధారం లేకపోయినా మాజీ సీఎంను అరెస్ట్ చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారు ?

స్కిల్ కేసులో తమ వద్ద ఆధారాలు లేవని… ఇటు కేసు కుట్ర రచయిత సజ్జల రామకృష్ణారెడ్డి, సీఐడీ చీఫ్ పొన్నవోలు, ఏఏజీ సుధాకర్ రెడ్డి నేరుగానే చెబుతున్నారు. ఇంకా దర్యాప్తు చేయాలంటున్నారు. కేసు పెట్టి రెండున్నరేళ్లయింది . దాదాపుగా అందర్నీ ప్రశ్నించారు. అన్ని ఖాతాలు పరిశీలించారు. ఇంకా ఏం దర్యాప్తు చేయాలో వారు చెప్పడం లేదు. చంద్రబాబుకు ఏం సంబంధం అంశాన్ని చెప్పడం లేదు. కేబినెట్ ఆమోదం ఉంది… ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ జరిగాయి… ఎక్విప్ మెంట్ , సాఫ్ట్ వేర్ మొత్తం వచ్చింది. ఇక అవినీతి ఎక్కడా అంటే చెప్పలేకపోతున్నారు.

పదే పదే అడ్డగోలు వాదనలు

సిమెన్స్ తో సంబంధం లేదని ఓ సారి సజ్జల రెచ్చిపోయారు. పత్రికలో సిమెన్స్ పేరుతో మోసం అని రాశారు. కానీ దొరికిపోయారు. ఇప్పుడు నోరు మెదపడం లేదు. తర్వాత కేబినెట్ ఆమోదం లేదన్నారు. ఆ పత్రాలు బయటకు వచ్చాయి. డబ్బుల విడుదలకు అధికారులు అభ్యంతరాలు చెప్పారన్నారు. ఆ ఫైల్స్ పోయాయని కథలు చెబుతున్నారు. అధికారులు అభ్యంతరాలు చెబితే డబ్బులు విడుదల చేసిన ప్రేమచంద్రారెడ్డి ఎందుకు సంతకాలు చేశారో ఆయనను ప్రశ్నించాలి కదా. అక్రమంగా డబ్బు విడుదల చేస్తే.. అరెస్ట్ చేయాల్సింది ప్రేమచంద్రారెడ్డి కదా. చంద్రబాబుకేం సంబంధం ?. ఇవన్నీ చెప్పడంలేదు.

అరెస్టు కోసమే స్కిల్ కేసు – మొత్తం కుట్ర బయటకు రావడం ఖాయం !

చంద్రబాబును అరెస్ట్ చేయడం కోసమే రాత్రికి రాత్రి స్కిల్ కేసులో చంద్రబాబు పాత్రను సృష్టించారు. కానీ ఇప్పుడు అది రివర్స్ అవుతోంది. మొత్తం నిజాలు ప్రజల ముందు ఉన్నాయి. వారు తేల్చుకుంటున్నారు. కానీ అడ్డగోలు అబద్దాలతో వస్తున్న వ్యవస్థలు సిగ్గుపడతాయా…. న్యాయం కోసం.. ధర్మం కోసం ప్రజలకు అండగా ఉండాలని.. వారి డబ్బులతో నడుస్తున్న వ్యవస్థలు సిగ్గుపడతాయా అన్నదే కీలకం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close