చంద్రబాబు వంటి గొప్ప నాయకుణ్ణి మళ్లీ మన జనరేషన్‌లో చూడలేం: అశ్వనీదత్‌

‘మహానటి’తో అశ్వనీదత్‌ మళ్లీ స్టార్‌ ప్రొడ్యూసర్ల రేసులోకి వచ్చారు. ఒకప్పుడు భారీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన వైజయంతి సంస్థ, ఆ సంస్థ అధినేత అశ్వనీదత్‌ సుమారు ఏడేళ్ల పాటు చిత్రనిర్మాణానికి దూరంగా వున్న సంగతి తెలిసిందే. ‘మహానటి’తో మళ్లీ వైజయంతి పేరు వార్తల్లో నిలిచింది. ఈ నెల 27న నాగార్జున, నాని హీరోలుగా అశ్వనీదత్‌ నిర్మించిన ‘దేవదాసు’ విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా మిత్రులతో అశ్వనీదత్‌ ముచ్చటించారు. సినిమా సంగతుల మధ్య ‘పొలిటికల్‌ ప్లాన్స్‌ ఏంటి?’ అని ప్రశ్నించగా… ‘‘సిన్సియర్‌గా తెలుగుదేశం పార్టీ పబ్లిసిటీ పనులు, పార్టీ పనులు చూసుకుంటాను. ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవడం లేదు. నాకు చేతనైనంత పబ్లిసిటీ విభాగంలో చేస్తాను. ‘దేవదాసు’ విడుదల కాగానే… పార్టీ పనులు చూసుకుంటాను. వచ్చే ఏడాది ఎన్నికలు వస్తాయి కదా! ఆల్రెడీ చంద్రబాబు నాయుడుగారికి ఇంట్రాక్ట్‌ అవుతున్నా. ఆ పనులు చూసుకుంటాను’’ అన్నారు.

‘ఈ కమిట్‌మెంట్‌ అన్నది ఎన్టీఆర్‌ పట్ల కృతజ్ఞతా? చంద్రబాబు పట్ల స్నేహభావమా?’ అని అశ్వనీదత్‌ని అడగ్గా… ‘‘నిజం చెబుతున్నా సార్‌! ఎన్టీ రామారావుగారు పార్టీ పెట్టాలని ఇక్కడికి వచ్చినప్పుడు… ‘సినిమా రంగంలో ఎన్నో ఉన్నత స్థానాలు అధిరోహించారు. ప్రజలకు కూడా మంచి చేస్తారు. చాలా గొప్పగా చేస్తారు. దైవాంస సంభూతుడు కదా’ అనుకున్నాను తప్ప, ఆయన వెంట నేను రాలేదు. నాకు అసలు ఆసక్తి లేదు. హైదరాబాద్‌ వచ్చి సెటిల్‌ అయిన తరవాత చంద్రబాబునాయుడుగారు చేస్తున్న పనులు చూసి… కేవలం ‘చంద్రబాబునాయుడు లాంటి గొప్ప నాయకుణ్ణి మళ్లీ మన జనరేషన్‌లో చూడలేం’ అని, ఆయన మీద ఎట్రాక్షన్‌తో రాజకీయాల్లోకి, పార్టీలోకి వచ్చాను. స్వతహాగా మా నరనరాల్లో, మా నాన్నగారి బ్లడ్‌లో వున్నది కమ్యునిస్ట్‌ పార్టీ బావజాలం. మేము బేసికల్లీ కమ్యునిస్టులం. మా నాన్నగారు పెద్ద కమ్యునిస్ట్‌. ఆ రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ మీద ఉద్యమాలు చేసి జైలుకి వెళ్లారు. నాకు చంద్రబాబుగారు మీద ఇష్టంతో తెలుగుదేశంలోకి వచ్చాను. ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. నామినేటెడ్‌ పదవులు ఆశించడం లేదు. మా స్వప్న పోటీ చేస్తే బావుంటుందని చాలామంది అడిగారు. పిల్లల మీద రాజకీయాలు రుద్దడం నాకిష్టం లేదు. వాళ్లు ఎవరికీ పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌ లేదు. చంద్రబాబు మంచిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనేది మాత్రమే ఆలోచిస్తా’’ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close