దీదీ… “జయ”హో !

ఏప్రిల్, మేనెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రజల నాడిపై సర్వేల పరంపర మొదలైంది. పలు సర్వేలు తమదైన శైలిలో అంచనాలను వెల్లడించాయి. ఇంచుమించు వీటన్నింటి సారాంశం ఒకటే కావడం విశేషం. పలు సర్వేల ఫలితాలను గమనిస్తే, ఈసారి ఎక్కువగా నష్టపోయే పార్టీ కాంగ్రెస్. కేరళలో ఆ పార్టీ ఓటమి ఖాయమని సర్వేలు చెప్తున్నాయి.

అస్సాంలోనూ బీజేపీ స్వల్ప ఆధిక్యంలో ఉందని అంచనాలు వెల్లడించాయి. ఇక, కీలకమైన బెంగాల్, తమిళనాడుల్లో సంచలనాలు ఏమీ నమోదు కావట. బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో జయలలితల హవా కాస్త తగ్గినా, మరోసారి గెలవడం ఖాయమని సర్వే అంచనాలు చెప్తున్నాయి. అతిచిన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిపై మీడియా సంస్థలు పెద్దగా దృష్టి పెట్టలేదు.

ఇండియా టీవీ, సీ వోటర్ తాజా సర్వే అంచనా ప్రకారం, వామపక్షాలకు ఓ వైపు మోదం, మరో వైపు ఖేదం తప్పదట. కేరళలో మళ్లీ పాగా వేయడం ఖాయంగా కనిపిస్తోంది. 34 ఏళ్ల కంచుకోట బద్దలైన బెంగాల్లో మాత్రం ఈసారి కూడా అధికారం దక్కదని సర్వే తేల్చింది. తాజా అంచనా ప్రకారం, పశ్చిమ బెంగాల్లో ఈసారి తృణమూల్ కాంగ్రెస్ 160, లెఫ్ట్ కూటమి 106, కాంగ్రెస్ 21, బీజేపీ 4 సీట్లు గెలవ వచ్చట. సెంచరీ మార్కును దాటడం వామపక్షాలకు కొంత ఊరటనిచ్చే విషయం. అయినా, మమతా బెనర్జీ మరోసారి గెలవడం ఖాయమనేది మాత్రం కామ్రేడ్లకు రుచించని విషయం.

బెంగాల్లో గెలవలేక పోయినా, కేరళలో మాత్రం ఎర్ర జెండా రెపరెపలాడుతుందట. వామపక్ష కూటమి 86 సీట్లు, కాంగ్రెస్ నాయకత్వంలోని యు డి ఎఫ్ 53 సీట్లు గెలుస్తాయట. ఆశ్చర్యకరంగా బీజేపీ ఒక సీటు గెలిచే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఆ ఒక్క సీటూ క్రికెటర్ శ్రీశాంత్ అందిస్తాడా లేక మరో అభ్యర్థా అనేది మాత్రం ప్రస్తుతానికి తెలియదు.

తమిళనాడులో అమ్మ పాలనకు డోకా లేదట. హవా కాస్త తగ్గినా, జయలలితపై ప్రజలకు నమ్మకం సడలలేదని సర్వే తేల్చింది. డీఎంకే కూటమి ఎంత ప్రయత్నించినా ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదట. అన్నాడీఎంకే 130, డీఎంకే కూటమి 70, ఇతరులు 34 సీట్లు గెలుస్తారట. బీజేపీకి ఒక్క సీటూ దక్కదని సీవోటర్ సర్వే తేల్చింది. 4 శాతం ఓట్లు మాత్రం వస్తాయని చెప్పింది.

ఇక అస్సాంలో కమలం వికసించే అవకాశం ఉందని ఎక్కువ సర్వేలు అంచనా వేశాయి. ఇండియా టీవీ, సీవోటర్ సర్వే తాజా అంచనా ప్రకారం, బీజేపీ కూటమి 55 సీట్లతో ముందంజలో ఉంటుందట. కాంగ్రెస్ కూటమి 53 సీట్లతో గట్టి పోటీ ఇస్తుందట. ఎ ఐ యు డి ఎఫ్ 12 సీట్లతో కింగ్ మేకర్ కావచ్చని ఓ అంచనా. అయితే, తమ విజయం ఖాయమని కాంగ్రెస్ బల్లగుద్ది చెప్తోంది. లేదు, ఎన్నికలు జరిగే నాటికి పుంజుకుంటామని, భారీ మెజారిటీ సాధిస్తామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రెండు ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ల పరిస్థితి ఏమిటనేది ఓ ఆసక్తికరమైన విషయం. ఒకవేళ అస్సాంలో అధికారంలోకి వస్తే అది బీజేపీకి చరిత్రాత్మక విజయం అవుతుంది. తూర్పు దిశగా విజయమనే ఉదయాన్ని చూడాలనుకుంటున్న కమలనాథుల కల నిజమవుతుంది. ఇక, కాంగ్రెస్ కేరళ, అస్సాంలలో ఓడిపోతే కేడర్ మరింత నిస్తేజంగా మారుతుంది. బెంగాల్, తమిళనాడుల్లోనూ ఆ పార్టీకి నామమాత్రపు సీట్లే దక్కే అవకాశం ఉంది. అంటే, హస్తం పార్టీకి ఇంకా కష్టకాలం కంటిన్యూ అవుతోంది. దీన్ని బ్రేక్ చేయడానికి హైకమాండ్ ఏంచేస్తుందో మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close