వెంకయ్య హడావుడే తప్ప కేంద్రానికేం శ్రద్ధ లేదు!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి.. నాయకులు చేస్తున్న హడావిడి తప్ప.. వాస్తవంగా కేంద్రంలో ఈ మేరకు రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి కసరత్తు మొదలైన వాతావరణం ఇప్పటిదాకా కనిపించడం లేదు. ఈసారి నియోజకవర్గాలు పెరుగుతాయి.. అందరికీ అవకాశాలు కల్పిస్తాం.. పార్టీని నమ్ముకుని ఏళ్లనుంచి పనిచేస్తున్న వారికి, కొత్తగా వస్తున్న వారికి ఎవ్వరికీ ఎలాంటి నష్టమూ జరగనివ్వం అనే కథలు వల్లిస్తూ.. ఇతర పార్టీలనుంచి వలసలను ప్రోత్సహించి, వాటిపట్ల తమ పార్టీలో అసంతృప్తులు రేగకుండా జాగ్రత్త పడడం వరకు మాత్రమే ఈ రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు ఈ పుకారు ఉపయోగపడుతున్నట్లుగా కనిపిస్తోంది. 2019 ఎన్నికలలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వచ్చేస్తాయనే పుకారును ప్రచారంలో పెట్టడం ద్వారా వక్రమార్గాల్లో తమ పార్టీలను బలోపేతం చేసుకోవడానికి ఈ రెండు తెలుగురాష్ట్రాల్లో అధికార పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

నిపుణులు చెబుతున్న విశ్లేషణలను బట్టి గానీ..ప్రాక్టికల్‌గా కనిపిస్తున్న పరిస్థితుల్ని బట్టి గానీ.. నియోజకవర్గాల పునర్విభజన అనేది ఈరెండు రాష్ట్రాల నేతలు, అటు కేంద్రంలోని వెంకయ్య చెబుతున్నంత వేగంగా, ఈజీగా పూర్తయ్యే పరిస్థితి లేదు. ఇటు చంద్రబాబు చేతిలో పావుగా మారిపోయినట్లుగా వెంకయ్యనాయుడు అక్కడేదో తాను వ్యవహారాన్ని స్పీడప్‌ చేస్తున్నట్లుగా బిల్డప్‌ ఇస్తున్నట్లుంది. కొత్త నియోజకవర్గాలు 2019 లోగా గ్యారంటీ అనే సంకేతం కేంద్రంనుంచి వస్తే గనుక.. ఇటు రాష్ట్రంలో తెలుగుదేశంలోకి మరింత మంది వైకాపా నేతల్ని వలసల రూపంలో ఆకర్షించడం వీలవుతుంది. కేవలం అందుకోసమే అటు వెంకయ్య, ఇటు చంద్రబాబు నాయుడులు కాస్త హైప్‌ ఇచ్చి నియోజకవర్గాలు వచ్చేస్తున్నాయి అనే ప్రచారం చేస్తున్నట్లుంది..

హోంమంత్రి రాజ్‌నాధ్‌తో గానీ, ఇతర సంబంధిత శాఖలతో గానీ వెంకయ్యనాయుడు భేటీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయే తప్ప.. ఆయా శాఖల్లో పని మొదలైనట్లుగా ఏమీ సంకేతాలు రావడం లేదు. హోం శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కూడా వార్తలు లేవు. రాజ్యాంగ నిపుణులు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ వంటి వారు టెక్నికల్‌ కారణాలు చూపుతూ ఇది త్వరగా సాధ్యం కాదని అంటున్నారు. రాజ్యాంగ సవరణ జోలికి వెళితే.. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే మాదిరి పట్టుపడతాయని.. ఆ తలనొప్పిని కేంద్రం కోరి తెచ్చుకోకపోవచ్చునని ఆయన విశ్లేషణ. శివాజీ మాటల ప్రకారం డీలిమిటేషన్‌ కమిటీ వేసినా ఆరేడేళ్లు పడుతుందని అంటున్నారు. అలాంటి నేపథ్యంలో అంత త్వరంగా కొత్త నియోజకవర్గాలు రాకపోవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వెంకయ్య హడావుడే తప్ప కేంద్రానికేం శ్రద్ధ లేదు!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి.. నాయకులు చేస్తున్న హడావిడి తప్ప.. వాస్తవంగా కేంద్రంలో ఈ మేరకు రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి కసరత్తు మొదలైన వాతావరణం ఇప్పటిదాకా కనిపించడం లేదు. ఈసారి నియోజకవర్గాలు పెరుగుతాయి.. అందరికీ అవకాశాలు కల్పిస్తాం.. పార్టీని నమ్ముకుని ఏళ్లనుంచి పనిచేస్తున్న వారికి, కొత్తగా వస్తున్న వారికి ఎవ్వరికీ ఎలాంటి నష్టమూ జరగనివ్వం అనే కథలు వల్లిస్తూ.. ఇతర పార్టీలనుంచి వలసలను ప్రోత్సహించి, వాటిపట్ల తమ పార్టీలో అసంతృప్తులు రేగకుండా జాగ్రత్త పడడం వరకు మాత్రమే ఈ రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు ఈ పుకారు ఉపయోగపడుతున్నట్లుగా కనిపిస్తోంది. 2019 ఎన్నికలలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వచ్చేస్తాయనే పుకారును ప్రచారంలో పెట్టడం ద్వారా వక్రమార్గాల్లో తమ పార్టీలను బలోపేతం చేసుకోవడానికి ఈ రెండు తెలుగురాష్ట్రాల్లో అధికార పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

నిపుణులు చెబుతున్న విశ్లేషణలను బట్టి గానీ..ప్రాక్టికల్‌గా కనిపిస్తున్న పరిస్థితుల్ని బట్టి గానీ.. నియోజకవర్గాల పునర్విభజన అనేది ఈరెండు రాష్ట్రాల నేతలు, అటు కేంద్రంలోని వెంకయ్య చెబుతున్నంత వేగంగా, ఈజీగా పూర్తయ్యే పరిస్థితి లేదు. ఇటు చంద్రబాబు చేతిలో పావుగా మారిపోయినట్లుగా వెంకయ్యనాయుడు అక్కడేదో తాను వ్యవహారాన్ని స్పీడప్‌ చేస్తున్నట్లుగా బిల్డప్‌ ఇస్తున్నట్లుంది. కొత్త నియోజకవర్గాలు 2019 లోగా గ్యారంటీ అనే సంకేతం కేంద్రంనుంచి వస్తే గనుక.. ఇటు రాష్ట్రంలో తెలుగుదేశంలోకి మరింత మంది వైకాపా నేతల్ని వలసల రూపంలో ఆకర్షించడం వీలవుతుంది. కేవలం అందుకోసమే అటు వెంకయ్య, ఇటు చంద్రబాబు నాయుడులు కాస్త హైప్‌ ఇచ్చి నియోజకవర్గాలు వచ్చేస్తున్నాయి అనే ప్రచారం చేస్తున్నట్లుంది..

హోంమంత్రి రాజ్‌నాధ్‌తో గానీ, ఇతర సంబంధిత శాఖలతో గానీ వెంకయ్యనాయుడు భేటీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయే తప్ప.. ఆయా శాఖల్లో పని మొదలైనట్లుగా ఏమీ సంకేతాలు రావడం లేదు. హోం శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కూడా వార్తలు లేవు. రాజ్యాంగ నిపుణులు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ వంటి వారు టెక్నికల్‌ కారణాలు చూపుతూ ఇది త్వరగా సాధ్యం కాదని అంటున్నారు. రాజ్యాంగ సవరణ జోలికి వెళితే.. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే మాదిరి పట్టుపడతాయని.. ఆ తలనొప్పిని కేంద్రం కోరి తెచ్చుకోకపోవచ్చునని ఆయన విశ్లేషణ. శివాజీ మాటల ప్రకారం డీలిమిటేషన్‌ కమిటీ వేసినా ఆరేడేళ్లు పడుతుందని అంటున్నారు. అలాంటి నేపథ్యంలో అంత త్వరంగా కొత్త నియోజకవర్గాలు రాకపోవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com