బాల‌కృష్ణ 100… బ‌డ్జెట్ ఎంత‌??

యావ‌త్ తెలుగు చల‌న చిత్ర ప‌రిశ్ర‌మ దృష్టీ ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ 100వ సినిమాపైనే ఫోక‌స్ అయ్యింది. బాల‌య్య ఎవ‌రితో జ‌ట్టు క‌డ‌తాడు? ఆ సినిమా ఎలా ఉండ‌బోతోంది? అన్న ప్ర‌శ్న‌లు నంద‌మూరి అభిమానుల్ని గ‌త రెండేళ్లుగా తొలిచేస్తున్నాయి. వాటికి స‌మాధానాలు ఇప్పుడిప్పుడే దొరుకుతున్నాయి. బాల‌య్య వందో సినిమా క్రిష్ ద‌ర్శ‌కుడన్న‌ది క‌న్‌ఫామ్ అయిపోయింది. ఓ చారిత్ర‌క నేప‌థ్య‌మున్న క‌థ‌తో… బాల‌య్య‌ను క్రిష్ ఒప్పించ‌గ‌లిగాడు. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి గా బాల‌య్య‌ను వెండి తెర‌పై చూపించ‌బోతున్నాడు. అయితే… ఈ సినిమాకి బ‌డ్జెట్ ఎంత పెట్టొచ్చ‌న్న విష‌యంపై బాల‌య్య మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌ట్టు టాక్‌.

సాధార‌ణంగా బాల‌య్య సినిమా అంటే రూ.25 నుంచి 35 కోట్ల‌కు లోపే ఉంటుంది. లెజెండ్ సినిమా రూ.50 కోట్ల మైలు రాయిని అందుకొన్న నేప‌థ్యంలో బ‌డ్జెట్ పెంచ‌డానికి నిర్మాత‌లూ రెడీగా ఉన్నారు. అయితే… బాల‌య్య వందో సినిమాకి ఈ బ‌డ్జెట్ డ‌బుల్ కానుంది. దాదాపు రూ.65 కోట్ల‌తో బాల‌య్య వందో సినిమా రూపుదిద్దుకొంటున్న‌ట్టు స‌మాచారం. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి చాలా వాస్ట్ కాన్వాన్ ఉన్న క‌థ‌. సాంకేతికంగా ఉన్న‌తంగా తీర్చిదిద్దితే గానీ… క‌థ‌కు న్యాయం జ‌ర‌గ‌దు. పైగా వార్ ఎపిసోడ్స్‌కి అధిక ప్రాధాన్యం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని బ‌డ్జెట్ కేటాయిస్తున్న‌ట్టు టాక్‌. ఈ క‌థ‌కు దాదాపుగా రూ.65 కోట్లు అవుతుంద‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ ప్రాధ‌మికంగా అంచ‌నా వేశాడ‌ట‌. దానికి బాల‌య్య నుంచి కూడా ఆమోద‌ముద్ర ల‌భించింద‌ని స‌మాచారం. క్రిష్ – వారాహి చ‌ల‌న చిత్రం సంస్థ‌లు క‌ల‌సి బాల‌య్య వందో సినిమాని నిర్మించ‌బోతున్నాయి. సో.. బాల‌య్య కెరీర్‌లోనే ఇది అత్య‌ధిక బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించే చిత్రం అవ్వ‌నున్న‌ది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close