క్రిష్ చేస్తున్న తెలివైన ప‌ని

చారిత్ర‌క నేప‌థ్య‌మున్న సినిమాల్ని తెర‌కెక్కించ‌డం సామాన్య‌మైన విష‌యం కాదు. తెరపై మ‌న‌దైన వాతావ‌ర‌ణం క‌నిపించ‌దు. మ‌న‌దైన భాష వినిపించ‌దు. ఎప్పుడో జ‌రిగిపోయిన క‌థ‌ని `మ‌సాలా` జోడించి క‌ళ్ల‌కు క‌ట్టాలి. అది నిజ‌మ‌ని న‌మ్మించాలి. ఇదంతా క‌త్తిమీద సామే. పైగా పౌరాణిక, జాన‌ప‌ద చిత్రాల‌న్నీ లెంగ్తీ ప్రాజెక్ట్స్‌. సినిమా నిడివి కూడా ఎక్కువ‌గానే వ‌చ్చేస్తుంది. దాదాపు మూడు గంట‌ల వ‌ర‌కూ సాగిన సినిమాలున్నాయి. చెప్పాల్సిన కంటెంట్ ఎక్కువ‌గా ఉండ‌డ‌మే అందుకు కార‌ణం. ఈ రోజుల్లో మూడు గంట‌ల సినిమా అంటే ఎవ‌రు చూస్తారు..?? క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి నిడివి కూడా ఎక్కువ‌గానే ఉంటుంద‌నుకొన్నారంతా. కానీ… క్రిష్ అక్క‌డే త‌న మాయాజాలం చూపించాడు. ఈ సినిమా కేవ‌లం 2 గంట‌ల 12 నిమిషాలు మాత్ర‌మే. ఓ మామూలు క‌మ‌ర్షియ‌ల్ సినిమా నిడివి కంటే త‌క్కువే.

ఇంత కంటే జ‌నం ఎక్కువ చూడ‌లేరు` అని క్రిష్ ముందే ఫిక్స‌యి క్రిస్పీగా స్క్రిప్టు రాసుకొన్నాడు. స్క్రిప్టు ద‌శ‌లోనే అవ‌వ‌స‌ర స‌న్నివేశాల్ని త‌గ్గించుకొంటూ వ‌చ్చాడ‌ట‌. లెంగ్తీ సీన్లు, భారీ డైలాగులు ఇవేం లేకుండా, ప‌ద్యాల జోలికి పోకుండా, సంస్క్రృత స‌మాసాల్ని వ‌ల్లించ‌కుండా జాగ్ర‌త్త పడిన‌ట్టు టాక్‌. ఇంత స్పాన్ ఉన్న క‌థ‌నీ కేవ‌లం 79 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాడంటే ఎంత ప్లాన్డ్‌గా వెళ్లాడో అర్థం అవుతోంది. పైగా ఇలా అనుకొన్నారో లేదో.. అలా షూటింగ్‌కి వెళ్లిపోయాడు. సెట్లు వేయ‌డానికి, కాస్ట్యూమ్ డిజైన్ చేయ‌డానికి పెద్ద స‌మ‌యం తీసుకోలేదు. త‌నకు అందుబాటులో ఉన్న లొకేష‌న్ల‌ని వాడుకోవ‌డం వ‌ల్ల సెట్స్ వేసే ప‌ని, ఖ‌ర్చు, స‌మ‌యం ఇవ‌న్నీ త‌గ్గిపోయాయి. మేకింగ్ విష‌యంలో క్రిష్ తెలివి తేట‌ల‌న్నీ ఇప్పుడే క‌నిపించిపోతున్నాయి. ఇక‌.. జ‌నాన్ని ఎంత‌లా మెప్పిస్తాడా అనేది తెర‌పైనే తేలాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close