వారెవా : సెట్లో బాల‌య్య చేసిన అద్భుతం..!

నంద‌మూరి బాల‌కృష్ణ రియ‌ల్ హీరో అనిపించుకొన్న సంద‌ర్భం ఇది. ఆయ‌న సాహ‌సాలు తెర‌పైనే కాదు.. కెమెరా బ‌య‌టా జ‌రుగుతాయి అనేదానికి నిలువెత్తు సాక్ష్యం ఇది. బాల‌య్య గ‌ట్స్ గురించి గొప్ప‌గా మాట్లాడుకొనే అభిమానులు పొంగిపోయే సంద‌ర్భం ఇది. అవును.. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి సెట్లో ఓ అద్భుతం చోటు చేసుకొంది. అదీ బాల‌య్య చేతుల మీదుగా. ఓ రిస్కీ షాట్‌లో పాల్గొన్న బాల‌కృష్ణ ఓ ప‌సివాడ్ని కాపాడిన అరుదైన ఘ‌ట్ట‌మిది. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం… వివ‌రాల్లోకి వెళ్తే..

బాల‌య్య వందో సినిమా షూటింగ్ ఆమ‌ధ్య మొరాకోలో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ యాక్ష‌న్ ఘ‌ట్టాల్ని తెర‌కెక్కించారు. వంద‌లాది మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల‌తో సాగిన యుద్ద‌ఘ‌ట్టం అది. ఓ షాట్ కోసం నాలుగేళ్ల ప‌సివాడ్ని గుర్రం మీద ఎక్కించుకొని బాల‌య్య దౌడు తీయాలి. ఆ స‌మ‌యంలో గుర్రాలు కాస్త బెదిరి కాస్త అటూ ఇటూగా ప‌రుగులు తీశాయి. దాంతో బాల‌య్య చేతిలో ఉన్న పిల్ల‌వాడు జారి.. కింద‌ప‌డ‌బోయాడ‌ట‌. స‌రిగ్గా అప్పుడే బాల‌య్య హీరోలా కింద‌కు దూకుతూ పిల్ల‌వాడ్ని కాపాడాడ‌ట‌. ఆ స‌మ‌యంలో బాల‌య్య‌ని గుర్రం కొంత‌దూరం వ‌ర‌కూ లాక్కెళ్లిపోయినా చేతిలో ఉన్న బాబుకి మాత్రం ఎలాంటి దెబ్బ‌లు త‌గ‌ల‌కుండా బాల‌య్య కాపాడాడ‌ట‌. ఈ ప్ర‌మాదంలో బాల‌య్య వీపుకు చిన్న చిన్న గాయాలు అయ్యాయ‌ని తెలుస్తోంది. అయినా స‌రే.. లెక్క చేయ‌కుండా ప‌సివాడి ప్రాణాలు కాపాడారు బాల‌య్య‌. ఈ విష‌యం యూనిట్ స‌భ్యుల ద్వారా బ‌య‌ట‌కు పొక్కింది. జై.. బాల‌య్య‌.. జై జై బాల‌య్య!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close