ఛార్జ్ తీసుకొన్న ‘టైస‌న్ నాయుడు’

యాక్ష‌న్ క‌థ‌ల‌కు ప‌ర్‌ఫెక్ట్ క‌టౌట్‌… బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పుడో ఓ సినిమా చేస్తున్నాడు. కొంత మేర షూటింగ్ జ‌రిగింది. ఈ రోజు బెల్లంకొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా కొత్త సినిమా టైటిల్ ప్ర‌క‌టించ‌డంతో పాటు గ్లింప్స్ కూడా విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి ‘టైస‌న్ నాయుడు’ అనే పేరు ఖ‌రారు చేశారు. ఇందులో బెల్లంకొండ డీఎస్‌పీ అధికారిగా క‌నిపించ‌బోతున్నాడు.

65 సెకన్ల నిడివి గ‌ల గ్లింప్స్‌ని ఈ రోజు విడుద‌ల చేశారు. బాక్సింగ్‌, యాక్ష‌న్‌, పోలీస్ బ్యాక్‌డ్రాప్ ఇలా.. చాలా అంశాల్ని ఈ గ్లింప్స్‌లో పొందుప‌రిచారు. గెడ్డంతో ర‌ఫ్‌గా, మాసీగా క‌నిపిస్తున్నాడు బెల్లంకొండ‌. విజువ‌ల్స్ కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమా కోసం 14 రీల్స్ సంస్థ‌ బాగానే ఖ‌ర్చు పెడుతున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. భీమ్స్ అందించిన బీజియ‌మ్స్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉన్నాయి. చివ‌ర్లో ఇనుప ఇసల్ని ప‌ట్టుకొని.. రౌడీ గ్యాంగ్‌పై దండెత్తిన బెల్లంకొండ‌ని చూస్తుంటే ఈ సినిమాలో యాక్ష‌న్‌కి పెద్ద పీట వేశార‌ని తెలుస్తోంది. క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది చెప్ప‌లేదు. హీరోని త‌ప్ప మ‌రో క్యారెక్ట‌ర్నీ స‌రిగా ఫోక‌స్ చేయ‌లేదు. మొత్తానికి బెల్లంకొండ ఇచ్చిన బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇంట్ర‌స్టింగ్ గానే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close