రాజగోపాల్ రెడ్డిని నమ్మి నట్టేట మునుగుతున్న బీజేపీ !

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి గోడ మీద పిల్లి తరహా రాజకీయాలు చేస్తున్నారు. 2018లో కాంగ్రెస్ ఓడిపోగానే.. ఆయన బీజేపీలో చేరిపోతానంటూ వెళ్లారు. చేరక ముందే అక్కడ ఆయన అతిని తట్టుకోలేకపోయారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని ప్రచారం చేసుకోవడం ప్రారంభించడంతో మొదట్లోనే కత్తిరించేశారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్ కు మద్దతుగా మాట్లాడటం ప్రారంభించారు. అసెంబ్లీకి హాజరయ్యారు. బండి సంజయ్ బీజేపీ చీఫ్ అయ్యాక.. ఆ పార్టీ కొద్దిగా పుంజుకోవడంతో మళ్లీ ఆ పార్టీ బాట పట్టారు.

చివరికి మునుగోడులో రాజీనామా చేస్తానని ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఎక్కడా లేనంత ఊపు వస్తుందని చెప్పి నమ్మించి అదే పని చేశారు. ఆయనకు సోదరుడు కూడా పరోక్షంగా అండగా నిలిచారు. తీరా.. మునుగోడులో ఓడిపోవడంతో… బీజేపీకి అప్పటి వరకూ వచ్చిన హైప్ అంతా కరిగిపోయింది. దీంతో రాజగోపాల్ రెడ్డితో చేసిన ప్రయోగం వికటించినట్లయింది. బీజేపీ పలుకుబడి తగ్గిపోవడంతో రాజగోపాల్ రెడ్డి కూడా జంప్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బీజేపీలో ఆయనకు రెండు పదవులు ఇచ్చినా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు.

కాంగ్రెస్ లో చేరాలని ప్రజల నుంచి ఒత్తిడి ఉందని ఆయన చెబుతున్నారు. ఆయన సోదరుడు కాంగ్రెస్ లోనే ఉన్నారు కాబట్టి… ఆ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడం.. వెంటనే మునుగోడు టిక్కెట్ దక్కడం సులువే. కానీ ఇలాంటి వారిని నమ్ముకున్న రాజకీయ పార్టీలు మాత్రం నిండా మునిగిపోతాయని బీజేపీ ఉదంతమే చెబుతోంది. కాంగ్రెస్ పార్టీనే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close