భాజ‌పాలోకి మ‌రో ఇద్ద‌రు… పార్టీ బ‌ల‌ప‌డుతోంద‌న్న‌ ల‌క్ష్మ‌ణ్‌!

తెలంగాణలో చేరిక‌ల్ని కొన‌సాగిస్తోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. తెలుగుదేశం పార్టీ నేత రేవూరి ప్ర‌కాష్ రెడ్డి, మాజీ ఎంపీ ర‌వీంద్ర నాయ‌క్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. భాజ‌పా నేత ముర‌ళీధ‌ర‌రావు స‌మ‌క్షంలో ఢిల్లీలో ఈ ఇద్ద‌రూ పార్టీలో చేరారు. భాజ‌పా విధానాలు త‌మ‌ని ఎంత‌గానో ఆక‌ర్షించాయ‌నీ, అందుకే చేరుతున్నామంటూ ఈ ఇద్ద‌రూ చెప్పారు. రేవూరి మీడియాతో మాట్లాడుతూ… సెంటిమెంట్ తో తెలంగాణ ఏర్ప‌డింద‌నీ, కానీ గ‌డ‌చిన ఆరేళ్లుగా తెరాస ప్ర‌జ‌ల‌కు మెరుగైన పాల‌న ఇవ్వ‌డం లేద‌న్నారు. కేసీఆర్ నియంతృత్వ పోక‌డలు పోతున్నార‌నీ, త‌ను చేసిన త‌ప్పుల్ని ఎవ‌రూ వేలెత్తి చూపించ‌నియ్య‌కుండా బ్లాక్ మెయిల్ రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు. తెలంగాణ వ‌నరుల్ని ఆ కుటుంబం దోచుకుని తింటోంద‌ని ఆరోపించారు.

ఈ సంద‌ర్భంగా భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ… ప్ర‌జ‌ల్లో తెరాస ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌న్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లూ, ఇత‌ర రాజ‌కీయ పార్టీల ప్ర‌ముఖులు కూడా తెరాస అవినీతినీ కుటుంబ పాల‌న‌ను ఎదుర్కోవాల‌ని కోరుకుంటున్నార‌నీ, ఆ ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తిగా భాజ‌పా ఎదుగుతోంద‌న్నారు. అందుకే, భాజ‌పాలోకి ఇత‌ర పార్టీల నుంచి చాలామంది వ‌చ్చి చేరుతున్నార‌ని అన్నారు. భాజ‌పాలో చేరిక‌ల్ని చూస్తూ తెరాస బెంబేలెత్తుతోంద‌నీ, అధికార పార్టీ నాయ‌కులు స‌హించ‌లేక‌పోతున్నార‌ని విమ‌ర్శించారు. రాజ‌కీయంగా ఎదుర్కోవాల్సింది పోయి, భాజ‌పా కార్య‌క‌ర్త‌లూ నాయ‌కుల మీదా దాడుల‌కు పాల్పడుతున్నార‌ని ఆరోపించారు! భాజ‌పా ఎంపీల‌ను, ఎమ్మెల్సీల‌ను, సర్పంచ్ లు ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని అధికారుల నుంచి స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తున్నార‌ని అన్నారు. ఆర‌కంగా అభివృద్ధిని అడ్డుకునే ప్ర‌య‌త్నం తెరాస చేస్తోంద‌న్నారు.

ల‌క్ష్మ‌ణ్ చెబుతున్న‌ట్టుగా భాజ‌పాలో చేరేందుకు ఇత‌ర పార్టీలు నాయ‌కులు వ‌స్తున్నారా, లేదంటే ఆ నాయ‌కుల ద‌గ్గ‌రి భాజ‌పా వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తోందా..? నాయ‌కుల సంఖ్యాప‌రంగా తెలంగాణ‌లో భాజ‌పా బ‌ల‌ప‌డుతోంది. కానీ‌, ఈ ప్ర‌జ‌ల్లో బ‌ల‌ప‌డిందో లేదో ఇంకా నిరూప‌ణ కాలేదు. ఏదో ఒక ఎన్నిక‌లు రావాలి, త్వ‌ర‌లో వ‌చ్చే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మెరుగైన స్థానాల‌ను ద‌క్కించుకుంటే… కొంత బ‌ల‌ప‌డింద‌ని చెప్పొచ్చు. ఈ మ‌ధ్య జ‌రుగుతున్న చేరిక‌ల‌న్నీ త‌ర‌చి చూస్తే, టీడీపీ బ‌లంగా లేక‌పోవ‌డం వ‌ల్ల వెళ్లిపోయిన‌వారు, కాంగ్రెస్ మ‌రింత బ‌ల‌హీన‌ప‌డుతోందని భావించి చేరుతున్న‌వారే ఎక్కువ‌‌. వీరంతా తెలంగాణ‌లో భాజ‌పా బ‌లాన్ని చూసి చేరుతున్నారు అనే కంటే… కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంద‌ని ఆక‌ర్షితులౌతున్న‌వారే ఎక్కువ అనొచ్చు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close