పిడిపి వ్యాఖ్యలతో బిజెపికి ఇరకాటం!

అఫ్జల్‌ గురు ఉరితీతపై కార్యక్రమం జరిగిందంటూ జెఎన్‌యు విద్యార్థి సంఘ నాయకులపై దేశ ద్రోహ నేరం ఆరోపించి అరెస్టు చేశారు..

కాని జమ్మూ కాశ్మీర్‌లో ఆ ఉరితీతను తీవ్రంగా ఖండించిన పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పిడిపి)తో కలసి అధికారం పంచుకోవడం ఇప్పుడు కూడా చర్చలు జరపడం బిజెపిని ఇరకాటంలో పడేసింది. కీర్తిశేషులైన ముఖ్యమంత్రి మఫ్తి మహ్మద్‌ సయిద్‌ కూడా అఫ్జల్‌ గురు అవశేషాలను అప్పగించాలని కోరిన వారిలో ఒకరు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగినందుకు పాకిస్తాన్‌కు కృతజ్ఞతలు చెప్పారాయన!

ఇప్పుడు జెఎన్‌యు కల్లోలం అనంతరం కూడా పిడిపి సీనియర్‌ నాయకుడు రఫీ అహ్మద్‌పరా మాట్లాడుతూ తాము ఈ ఉరితీత సరికాదన్న అభిప్రాయానికే కట్టుబడివున్నామని ఆదివారం పునరుద్ఘాటించారు. బిజెపి ప్రభుత్వం ఆయన భౌతిక అవశేషాలను అప్పగించాలని కోరారు. ఆ పార్టీ యువ నాయకుడు కూడా అదే కోరారు. పిడిపి అగ్రనాయకులే బాహాటంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. గతంలో వారితో స్నేహం నెరపడమే గాక మెహబూబా మఫ్తీతో కలసి ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తంటాలు పడుతున్న బిజెపి గాని కేంద్ర నాయకులు గాని దేశ ద్రోహులై పోతారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎట్టిపరిస్తితుల్లో ఇలాటి శక్తులను సహించేది లేదంటున్న హౌం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెంటనే కాశ్మీర్‌ పయనం కడతారా అని అడుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

వైసీపీ ఘోర పరాజయం ఖాయం – జగన్‌కు ఎప్పుడో చెప్పా : ప్రశాంత్ కిషోర్

ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ తన అంచనాను మరోసారి చెప్పారు. వైసీపీ ఘోర పరాజయం ఖాయమని అన్నారు. ఈ విషయాన్ని తాను ఏడాదిన్నర కిందటే జగన్ కు చెప్పానని స్పష్టం చేశారు. ఆర్టీవీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close