బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖలో కలిపిన ఆంధ్ర ప్రభుత్వం

బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖలోకి కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులు చూసి అటు బీసీవర్గాలు ఇటు బ్రాహ్మణ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. తమను బీసీల్లో కలపాలని ఏ బ్రహ్మణ నేత కూడా అడిగి ఉండరు. అయినప్పటికీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ను తీసుకెళ్లి బీసీ సంక్షేమ శాఖలో ఎందుకు కలిపారో ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు దీనికి ప్రాతిపదిక ఏమిటో కూడా అంచనా వేయలేకపోతున్నారు. బీసీ కార్పొరేషన్లకు ఇప్పటికే పేరు గొప్ప పదవులు ప్రకటించారు. కానీ ఆ కార్పొరేషన్లకు నిధులు మాత్రం లేవు. అమ్మఒడి.. పెన్షన్లను కార్పొరేషన్ ఖాతాలో వేసి నిధులు బదిలీ చేసి ఇస్తున్నారు. ఆ మాటకొస్తే బ్రాహ్మణ కార్పొరేషన్ పరిస్థితి కూడా అంతే. పేపర్ మీద నిధుల కేటాయింపు చూపి వెంటనే బదిలీ చేస్తున్నారు.

ఇలాంటి నిధులు లేని పరిస్థితుల్లో బీసీల కిందకు బ్రాహ్మణులను తీసుకు రావడం ఏమిటో చాలా మందికి అర్థం కాలేదు. అయితే ఇక్కడా ఓ తిరకాసు ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల దేవాదాయశాఖ నిధులు మళ్లిస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. అమ్మఒడి వంటి పథకాల‌లో బ్రహ్మణ లబ్దిదారులు ఉంటే వారికి కార్పొరేషన్ కింద సాయం చేస్తున్నట్లుగా లెక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ దేవాదాయ శాఖ పరిధిలో ఉంది.

ఇలా లెక్కలు చూపించడానికి బ్రాహ్మణ కార్పొరేషన్ తరపున దేవాదాయ శాఖ నిధులు విడుదల చేస్తే అది భక్తుల సొమ్మును వాడుకుంటున్నారన్న అనుమానాలకు కారణం అవుతోంది. కోర్టుల్లో కేసులు పెడుతున్నాయి. ఈ చిక్కులు తప్పించుకోవడానికి అసలు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను దేవాదాయ శాఖ నుంచి తప్పిచాలని నిర్ణయించారు. కానీ ఎక్కడ కలపాలో తెలియ బీసీ సంక్షేమ శాఖ కిందకు కలిపేశారు. బీసీల్లో లేని బ్రాహ్మణుల సంక్షేమం ఇక బీసీ సంక్షేమ శాఖ చూస్తుందన్న మాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close