బుగ్గన, బొత్సలే సెలక్ట్ కమిటీల చైర్మన్లు..!

వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్ కమిటీలను శాసనమండలి చైర్మన్ షరీఫ్ నియమించారు. కొద్ది రోజులుగా ఈ అంశంపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు. శాసనమండలిలో ఆయా బిల్లులను పెట్టిన వారినే… చైర్మన్‌లుగా ఖరారు చేశారు. సీఆర్డీఏ రద్దు బిల్లు సెలక్ట్‌ కమిటీ చైర్మన్‌గా బొత్స సత్యనారాయణ, వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీ కి చైర్మన్ గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహరిస్తారు. సీఆర్డీఏ రద్దు బిల్లు సెలక్ట్ కమిటీలో సభ్యులుగా టీడీపీ సభ్యులైన దీపక్‌రెడ్డి, అర్జునుడు, రవిచంద్ర, శ్రీనివాసులు . వైసీపీ నుంచి మహ్మద్ ఇక్బాల్ , పీడీఎఫ్ నుంచి వెంకటేశ్వరరావు , బీజేపీ నుంచి సోము వీర్రాజు సభ్యులుగా ఉంటారు.

పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీలో సభ్యులుగా లోకేష్‌, అశోక్‌బాబు, తిప్పేస్వామి, సంధ్యారాణి పీడీఎఫ్ నుంచి లక్ష్మణరావు , బీజేపీ నుంచి మాధవ్, వేణుగోపాల్‌రెడ్డిలను నియమించారు. సభ్యులుగా ఎవరెవర్ని నియమించాలో.. టీడీపీ, బీజేపీ , పీడీఎఫ్ పేర్లు ఇచ్చాయి కానీ… వైసీపీ మాత్రం ఇవ్వలేదు. అయితే.. బిల్లు పెట్టిన వారినే చైర్మన్ గా నియమించాలన్న సంప్రదాయం ఉండటంతో ఆ మేరకు..షరీఫ్ నియామక ప్రకటన చేశారు.

అయితే..ఇప్పటికే సెలక్ట్‌ కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం..తామూ భాగస్వామ్యం కాబోమని.. మండలి చైర్మన్‌కు బుగ్గన, పిల్లి సుభాష్‌, ఉమ్మారెడ్డి లేఖ రాశారు. అయినా షరీఫ్… నిబంధనల ప్రకారం… సెలక్ట్ కమిటీని ప్రకటించారు. సెలక్ట్‌ కమిటీలు ఏర్పాటు చేసినట్లు..తెలిసిందని… కమిటీ చైర్మన్‌గా బాధ్యత స్వీకరించే పరిస్థితి లేదని బుగ్గన మీడియాకు స్పష్టం చేశారు. సెలక్ట్ కమిటీ చైర్మన్లు బాధ్యతలు తీసుకోకపోతే.. తదుపరి ఏం చేయాలన్నది… మండి చైర్మన్ నిర్ణయించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close