“రాజద్రోహం” కేసులపై కేంద్రం దృష్టి..!

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 124 Aను ప్రభుత్వాలు రాజకీయ కక్ష సాధింపుల కోసం దుర్వినియోగం చేస్తూండటంతో కేంద్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు వస్తున్నాయి. రాజద్రోహం పేరుతో.. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై ఈ సెక్షన్ కింద కేసు పెట్టి.. అప్పటికప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక ఫిర్యాదులు కేంద్రంతో పాటు సుప్రీంకోర్టు వరకూ వెళ్లాయి. గత ఏప్రిల్ 30వ తేదీన 124A సెక్షన్ వాలిడిటీపై దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యంగా 124A సెక్షన్‌పై వ్యాలిడిటీపై ప్రత్యేకంగా ఓ నిపుణుల కమిటీని నియమిస్తోంది.

రాజ్యాంగంలో భావ ప్రకటనా స్వేచ్చను పౌరులకు కల్పించారు. అయితే.. ఇటీవలి కాలంలో ఐపీసీలోని సెక్షన్ 124Aను అధికారంలో ఉన్న వారు విరివిగా అమలు చేస్తున్నారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిపై రాజద్రోహం కేసులు పెడుతున్నారు. నిజానికి హేట్ స్పీచ్ అనేది నేరమని.. 124A సెక్షన్ కింద శిక్ష విధించవచ్చని చెబుతున్నారు. కానీ హేట్ స్పీచ్ అనేదానికి అసలు నిర్వచనమే లేదు. ఏది హేట్ స్పీచ్.. ఏది కాదు అన్నదానిపై స్పష్టత లేదు. దీన్నే ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న వారు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారు.

ఇటీవలి కాలంలో ఏపీలో రాజద్రోహం పేరుతో కేసులు పెట్టడం అధికం అయింది. జడ్జి రామకృష్ణను ఇదే సెక్షన్ కింద అరెస్ట్ చేసి.. ఇంత వరకూ బెయిల్ రాకుండా జైల్లో ఉంచారు. రఘురామకృష్ణరాజుపైనా అదే కేసు పెట్టారు. నిజానికి గతంలో చాలా సందర్భాల్లో 124A సెక్షన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఆషామాషీగా ఆ సెక్షన్ కింద కేసులు పెట్టడం కుదరదని స్పష్టం చేసింది. అయితే కొంత కాలం అయినా జైల్లో పెట్టవచ్చన్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటున్నారు. ఇప్పుడీ సెక్షన్ గురించి… సుప్రీంకోర్టు తేల్చాలనుకుంటోంది. అందుకే.. హేట్ స్పీచ్ కిందకు ఏవి వస్తాయో.. ఏది భావప్రకటనా స్వేచ్చనో నిర్దేశించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close