వంగవీటి రాధాను పరామర్శించిన చంద్రబాబు ! పోలీసుల తీరుపై అనుమానాలు

తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబునాయుడు పరామర్శించారు. రెక్కీ నిర్వహించిన దానికి సీసీ కెమెరా దృశ్యాలు ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని సమావేశం తర్వాత చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజ‌లు న‌మ్మే విధంగా పోలీసుల విచారణ ఉండాలని.. ,ఘటన విషయం బయటకు వచ్చి ఇప్పటికే వారం అవుతుంది… అయినా ఏమీ తేల్చలేదన్నారు. ఫిర్యాదు రాలేదని పోలీసులు చెబుతున్నారని.. తాను డీజీపీకి లేఖ కూడా రాశానని…దాని ఆధారం గా విచార‌ణ చెయ్యలేరా! అని ప్రశ్నించారు.

త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని స్వ‌యంగా వంగ‌వీటి రాధా చెప్పారు.ఇంటి వద్ద కారు తిరిగిన‌ట్లు ఆదారాలు వ‌చ్చిన త‌రువాత కూడా ఎందుకు దోషుల‌ను ప‌ట్టుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. దోషుల‌ను ర‌క్షించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుందని చంద్ర‌బాబు పోలీసులపైఅనుమానం వ్యక్తం చేశారు. వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాధాకృష్ణ తనపై రెక్కీ నిర్వహించిన విషయాన్ని బయట పెట్టారు. ఈ అంశం సంచలనం సృష్టించింది.

తనపై దాడికి రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధాకృష్ణ ఆరోపణలు చేసిన తర్వాత ఎక్కువగా తాడేపల్లిలోని ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నారు. తనను పరామర్శించడానికి వచ్చే వారితో అక్కడే సమావేశం అవుతున్నారు. చంద్రబాబు కూడా తాడేపల్లిలోని ఇంటికే వెళ్లారు. వంగవీటి ాధాకృష్ణను రెక్కీ గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ తల్లి కూడా ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close