చంద్రబాబు ప్రచారం వల్ల వాళ్లకి ఓట్లొస్తాయా..? సీట్లొస్తాయా..?

టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రాంతీయ పార్టీ తరపున పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఆయా పార్టీలకు తన వంతు సాయం చేసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇప్పటికే.. కర్ణాటక, తమిళనాడుకు వెళ్లిన ఆయన ఇప్పుడు ఇతర రాష్ట్రాల ప్రచారానికి వెళ్తున్నారు. చంద్రబాబు ప్రచారం వల్ల.. ఆయా పార్టీలకు పెద్దగా ఓట్లు.. సీట్లు వచ్చే అవకాశాలు ఏమీ ఉండవు. మరి ఎందుకు ప్రచారం..? దీని వెనుక అసలు లెక్క ఉంది..!

బెంగాల్‌లో చంద్రబాబు ప్రచారంతో మమతకు లాభమేనా..?

ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపై ఉంచేందుకు.. శతవిథాలా ప్రయత్నిస్తున్న … టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయా పార్టీల ప్రచారానికి…కూడా వెళ్తున్నారు. బుధ, గురువారాల్లో ఆయన పశ్చిమబెంగాల్‌లో…తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు. బెంగాల్‌లో కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున తెలుగు వారున్నారు. కోల్‌కతాలోనూ.. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన స్థిరపడిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. దీంతో..చంద్రబాబు ప్రచారం ఉపయోగపడుతుందని.. మమతా బెనర్జీ కూడా భావిస్తున్నారు. చంద్రబాబును రెండు రోజుల పాటు ప్రచారానికి రావాలని ఆమె కోరారు. దానికి సీఎం అంగీకరించారు.

ఇతర రాష్ట్రాల్లో ఉనికి చాటుకునేందుకు చంద్రబాబు తాపత్రయమా..?

కోల్‌కతా ప్రచారం తర్వాత చంద్రబాబు.. ఢిల్లీలోనూ ప్రచారం చేసే అవకాశాలున్నాయి. అయితే.. ఢిల్లీలో..కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు రెండూ…పరస్పరం పోటీ పడుతున్నాయి. ఎన్నికల తర్వాత ఆమ్ఆద్మీ పార్టీ కూడా..ప్రాంతీయ పార్టీల కూటమిలో భాగస్వామ్యం కావడం ఖాయం. కాంగ్రెస్‌తోనూ..చంద్రబాబు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరికి మద్దతుగా ప్రచారం చేస్తే.. మరొకరికి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదన్న లక్ష్యం పెట్టుకున్న చంద్రబాబు ఇప్పటికే.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలకు మద్దతు ప్రకటించారు. కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ కూటమికి అనుకూలంగా ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత తమిళనాడు వెళ్లి.. కాంగ్రెస్-డీఎంకే కూటమికి మద్దతివ్వాలని తమిళనాడులోని తెలుగువారికి చెన్నై వెళ్లి మరీ పిలుపునిచ్చారు.చంద్రబాబు కూడా… పలువురు ప్రాంతీయ పార్టీల నేతల్ని ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించారు. ఫరూక్ అబ్దుల్లా, మమతా బెనర్జీ, దేవేగౌడ లాంటి నేతలు.. టీడీపీ కోసం.. ఏపీకి వచ్చి ప్రచారం చేసి వెళ్లారు.

మోడీ వ్యతిరేక పార్టీలన్నీ సమైక్యంగా ఉన్నాయన్న సందేశమా..?

చంద్రబాబు.. వేరే రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేసినా.. ఆయా పార్టీల నేతలు ఏపీకి వచ్చి ప్రచారం చేసినా… ఓట్ల పరంగా… పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు కానీ… మొత్తంగా చూస్తే.. విపక్ష పార్టీలన్నీ.. బీజేపీకి వ్యతిరేకంగా సమైక్యంగా ఉన్నాయన్న భావన మాత్రం ప్రజల్లోకి వెళ్తుంది. అందు కోసమే.. చంద్రబాబునాయుడు..మొదటి నుంచి.. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలన్నింటినీ పరస్పర సహకారం అందించుకునేలా చేశారు. ఈ స్ఫూర్తి ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఉంటుందన్న నమ్మకంతో చంద్రబాబు ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వీవీ ప్యాట్లు, ఎన్నికల సంఘం వివక్ష వంటి అంశాలపై ఈ పార్టీలన్నీ కలసి పోరాడుతున్నాయి కూడా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘స‌లార్ 2’… రెడీ టూ షూట్‌!

ప్ర‌భాస్ మూడ్ మొత్తం సినిమాల‌పైనే ఉంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా, షూటింగులు చేసుకొంటూ వెళ్లిపోతున్నాడు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ 'క‌ల్కి'తో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌, ఆ త‌ర‌వాత 'రాజాసాబ్' కు కొన్ని డేట్లు...

దటీజ్ పవన్ – ముద్రగడకు గౌరవం !

కుటుంబాల్లో చిచ్చు పెట్టడం వైసీపీ రాజకీయవ్యూహంలో ఒకటి. రామోజీరావు కుటుంబం నుంచి దేవినేని ఉమ కుటుంబం వరకూ ఎక్కడ చాన్స్ వచ్చినా వదిలి పెట్టలేదు. కానీ జనసేన చీఫ్ పవన్...

జగన్‌పై సీఐడీ కేసు పెట్టక తప్పదా !?

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని మల్లాది విష్ణు ఫిర్యాదు చేస్తే వెంటనే సీఐడీలోని ఫలానా అధికారి విచారించాలని సీఈవో కార్యాలయం నుంచి ...

ఈసీ ఫెయిల్యూర్ – పోస్టల్ బ్యాలెట్స్ ఇలానా ?

ఏపీ ఎన్నికల సంఘం పనితీరు అత్యంత ఘోరంగా ఉంది. కనీసం పోస్టల్ ఓటింగ్ ను సరైన పద్దతిలో నిర్వహించడం కూడా చేత కాలేదు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ స్మూత్ నిర్వహించడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close