ఉగాది నాడు అబద్ధాలా బాబు ?

2014 ఎన్నికల ప్రచారం సమయం నుంచీ ఇప్పటి వరకూ కూడా చంద్రబాబు చెప్పినన్ని అబద్ధాలు చెప్పినవాళ్ళు తెలుగు నేలపైన ఇంకొకరు ఉండరేమో. మరీ ముఖ్యంగా నాయకుల్లో మాత్రం కచ్చితంగా చంద్రబాబుదే రికార్డ్. రైతు రుణమాఫీలు చేస్తానన్నాడు. మొదటి సంతకం రుణమాఫీ ఫైలుపైనే అన్నాడు. అలానే ఇంకెన్నో హామీలు. అన్ని హామీల విషయంలోనూ అబద్ధాలనే ఆయుధంగా మలుచుకుంటున్నాడు చంద్రబాబు. ఓటుకు కోట్లు లాంటి క్రైమ్స్ విషయం పక్కనపెడితే పరిపాలనా సంబంధమైన విషయాల్లో కూడా చంద్రబాబు నోటి వెంట అలవోకగా అసత్యాలు వచ్చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్‌ని కేంద్రమే తనకు అప్పగించింది అని చెప్పాడు. వైఎస్ జగన్‌పైన ఆరోపణలు, విమర్శలు చేసే సమయంలో చంద్రబాబు ఏమైనా చెప్పుకోవచ్చు కానీ ప్రజలకు సంబంధించిన విషయాల్లో అబద్ధాలతో కాలం వెళ్ళబుచ్చడం మాత్రం చంద్రబాబు స్థాయిని పాతాళానికి తీసుకెళ్తుంది.

ఇక తాజాగా చంద్రబాబు చెప్పిన అబద్ధం అయితే తెలుగువారందరినీ ఆశ్ఛర్యపరుస్తోంది. టిడిపి నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా చంద్రబాబు అసత్యాలను భరించలేని పరిస్థితి వచ్చేసినట్టే కనిపిస్తోంది. తెలుగు సంవత్సరాది ఉగాది రోజు ఆ స్థాయి అబద్ధాలకు చంద్రబాబు నాంది పలుకుతాడని ఎవ్వరూ ఊహించలేదు. ‘వ్యవస్థను మార్చడం తన ఒక్కడివల్లా కాదని…మీలాంటి వారు రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థను మార్చాలంటూ తాను కోరితేనే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు….’ అని చంద్రబాబు చెప్పడాన్ని ఎలా విశ్లేషించాలో కూడా రాజకీయ విశ్లేషకులకు, 80ల నుంచి రాజకీయాలను పరిశీలిస్తున్న వాళ్ళకు అర్థం కావడం లేదు. చంద్రబాబు చెప్పింది ఆ స్థాయి అబద్ధం మరి. జనాలు నవ్వుకుంటారన్న భయం కానీ, రేపటి నుంచి తాను చెప్పే ఏ ఒక్క మాటను కూడా ఎవ్వరూ నమ్మరన్న సంకోచం లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ స్థాయిలో అబద్ధాలు ఆడడమంటే మామూలు విషయం కాదు. తన అంత సీనియర్ ఇంకెవ్వరూ లేరు అని చెప్పుకునే చంద్రబాబునాయుడు తెలుగు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు? అబద్ధాలు చెప్పి బ్రహ్మాండంగా బ్రతికెయ్యొచ్చు….మనకు భజన చేసే మీడియా ఒకటి ఉంటే చాలు అని నిరూపించదల్చుకున్నారా?

ఇక చంద్రబాబు అహంకారం కూడా రోజు రోజుకూ శృతిమించుతోంది. ఇంతకుముందు వరకూ అధికారులను, తోటి నాయకులను మాత్రమే అవమానించేవాడు చంద్రబాబు. తాను ఒక్కడినే సమర్థుడిని, తాను ఒక్కడినే పనిచేస్తున్నాను…….మీరందరూ వేస్ట్ అనేది చంద్రబాబు పాలసీ. ఇప్పుడు ప్రజల విషయంలో కూడా ఇలానే స్పందిస్తున్నాడు చంద్రబాబు. నేను లేకపోతే ఆంధ్రప్రదేశ్‌కి దిక్కులేదే అని ఏ ముహూర్తాన వెంకయ్యనాయుడు అన్నాడో కానీ అప్పటి నుంచీ చంద్రబాబు మాటల్లో కూడా అదే అర్థం ధ్వనిస్తోంది. నేను బాగా ఉన్నంత కాలమే, నేను అధికారంలో ఉన్నంత కాలమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుంటారు…..తాను అనారోగ్యం పాలైతే రాష్ట్రం కూడా అధోగతి పాలవుతుంది అనే స్థాయి మాటలు మాట్లాడడం చంద్రబాబు అహంభావానికి నిలువెత్తు నిదర్శనం. ఇవే అర్థం వచ్చే మాటలు ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాడు చంద్రబాబు. నేను ఒక్కడినే పనిచేస్తుంటే..మీరు అందరూ తిని కూర్చుంటారా అనేలా ప్రజలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు. వయసు ప్రభావమో…లేకపోతే భజన మీడియా పుణ్యమాని ఆయన ఆత్మవిశ్వాసం స్థాయి అహంభావం స్థాయిలు దాటి ఇంకా పై స్థాయికి వెళుతుందో ఏమో తెలియదుకానీ అబద్ధాలు చెప్పడం, అహంభావాన్ని ప్రదర్శించడం లాంటి చర్యలతో తన వ్యక్తిత్వానికి తానే మసిపూసుకుంటున్నాడు చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీ తెలుగు వారిని అవమానించిన, అవమానిస్తున్న నేపథ్యంలో…కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా… ఏ ఆత్మగౌరవ నినాదంతో టిడిపి అధికారంలోకి వచ్చిందో….ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా అదే ఆత్మగౌరవ నినాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆలోచనల్లో మొదలైందంటే మాత్రం నారావారి అధికార అహంభావం మట్టిలో కలిసిపోయే టైం వచ్చేసినట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=Eou1oqvFa9COa1uy విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close