చిరు చ‌మ‌త్కారం.. మోహ‌న్‌బాబు పుర‌స్కారం

చిరు – మోహ‌న్‌బాబు.. వీళ్ల‌ది భ‌లే జోడీ. టామ్ అండ్ జెర్రీలాంటోళ్లం.. అని చిరంజీవే త‌మ జోడీ గురించి చెప్పుకున్నారు ఒక‌ప్పుడు. ఇద్ద‌రూ క‌లిశారంటే ఒక‌ళ్ల‌పై మ‌రొక‌రు పంచ్‌లు వేసుకుంటుంటారు. బ‌య‌ట ఎలా ఉంటారో తెలీదు గానీ, సినీ వేడుకల్లో మాత్రం ఆప్యాయ‌త టన్నుల కొద్దీ కురిపించుకుంటారు. అలాంటి సంఘ‌ట‌నే సుబ్బ‌రామిరెడ్డి అవార్డు వేడుక‌లో జ‌రిగింది.

ఆదివారం రాత్రి విశాఖ‌ప‌ట్నంలో టీఎస్ఆస్ అవార్డుల కార్య‌క్ర‌మం జ‌రిగింది. నాగార్జున‌, బాల‌కృష్ణ‌, మోహ‌న్‌బాబులకు టీఎస్ఆర్ అవార్డులు ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్ని అందించ‌డానికి చిరంజీవి అతిథిగా వ‌చ్చాడు. `నా సోద‌రులు బాల‌కృష్ణ‌. నాగార్జున‌, మోహ‌న్‌బాబుల‌కు అవార్డులు వ‌చ్చాయి.. నాకే ఏ అవార్డూ రాలేదు` అని చిరు త‌న ప్ర‌సంగంలో చ‌మ‌త్క‌రించాడు. అది గుర్తు పెట్టుకున్న మోహ‌న్ బాబు చిరు ప్ర‌సంగం పూర్త‌యిన వెంట‌నే `నీకు అవార్డు రాలేదు క‌దా.. నాకొచ్చిన గురువుగారి అవార్డు నీకే ఇస్తున్నా తీసుకో` అంటూ.. త‌న శాలువాని చిరంజీవికి క‌ప్పాడు. ఆ ప‌రిణామానికి చిరు షాకైనా, వెంట‌నే తేరుకుని `ఇద్ద‌రం పంచుకుందాం` అని ఆ శాలువాని.. మోహ‌న్‌బాబుపైనా క‌ప్పేశాడు.

టీ.ఎస్‌.ఆర్ అవార్డుల్లో హైలెట్ అయిన దృశ్యం ఇదే. ఒకే వేదిక‌పై చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ‌, మోహ‌న్‌బాబుల‌ను చూడ‌డం.. వాళ్లంతా ఈ ఫంక్ష‌న్ అయ్యేంత వ‌ర‌కూ వేదిక‌పైనే ఉండ‌డం ఆక‌ట్టుకుంది. ఇలా స్టార్లంద‌రినీ ఒకే వేదిక‌పై తీసుకొచ్చిన ఘ‌న‌త మాత్రం సుబ్బ‌రామిరెడ్డిదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

‘పూరీ’ తమ్ముడికి ఓటమి భయం?

విశాఖపట్నం జిల్లాలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి నర్సీపట్నం 'హార్ట్' లాంటిది, ఇక్కడ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్...

మదర్స్ డే @ 200 సంవత్సరాలు

ప్రతి ఏడాది మే రెండో ఆదివారం మదర్స్ డే గా జరుపుకుంటారని మనకు తెలుసు.. అయితే ఈ ప్రతిపాదన మొదలై 200 సంవత్సరాలు అయిందనే విషయం మీకు తెలుసా? వాస్తవానికి 'మదర్స్ డే వేడుకలు'...

కోమటిరెడ్డికి హైకమాండ్ వద్ద రిమార్క్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close