చిరంజీవిని ‘విల‌న్‌’గా అలా ఇరికించారు!

చిరంజీవి త‌న కెరీర్ ప్రారంభంలో నెగిటీవ్ క్యారెక్ట‌ర్లు పోషించిన వాడే. 47 రోజులు లాంటి సినిమాల్లో.. త‌న‌లో విల‌నిజం చూడొచ్చు. అయితే ఆ త‌ర‌వాత హీరో ఇమేజ్ రావ‌డంతో… నెగిటీవ్ రోల్స్ వైపు వెళ్ల‌లేదు. కాక‌పోతే.. ‘చిరంజీవి’ అనే సినిమాలో మాత్రం నెగిటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ పోషించాడు చిరు. ఆ సినిమా క‌థ బాగున్నా, చిరుని అలా చూడ్డానికి ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డ‌లేదు. ఎందుకంటే అప్ప‌టికే చిరుకి మాస్ ఇమేజ్ వచ్చేస్తోంది. హీరోగా కొన్ని సినిమాలు హిట్ట‌య్యాయి. దాంతో… ‘చిరంజీవి’ సినిమా ఫ్లాప్ అయ్యింది. నిజానికి ఈ సినిమా చేయ‌డం చిరంజీవికి కూడా ఇష్టం లేద‌ట‌. బ‌ల‌వంతంగా ఇరికించార‌ట‌. ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని ఈరోజు గుర్తు చేసుకొన్నారు చిరంజీవి. గాడ్ ఫాద‌ర్ విజ‌య‌వ‌తంగా న‌డుస్తున్న సంద‌ర్భంగా మీడియాతో చిరంజీవి చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా…నెగిటీవ్ రోల్స్ చేస్తారా? అనే ప్ర‌శ్న ఎదురైంది. త‌న‌ని అలాంటి క్యారెక్ట‌ర్స్ లో జ‌నం చూస్తార‌ని అనుకోవ‌డం లేద‌ని.. నిజంగానే ప్రేక్ష‌కులు త‌న‌లోని విల‌న్ ని చూడ్డానికి ఇష్ట‌ప‌డితే త‌ప్ప‌కుండా చేస్తాన‌న‌ని చెబుతూ.. ‘చిరంజీవి’ సినిమా ఎపిసోడ్ ని గుర్తు చేశారు.

”క‌న్న‌డ‌లో హిట్ట‌యిన ‘న‌న్నే రాజా’ అనే సినిమా నాకు చూపించారు. అందులో హీరో క్యారెక్ట‌ర్ లో కొన్ని నెగిటీవ్ షేడ్స్ ఉంటాయి. అంబ‌రీష్ కూడా ఓ పాత్ర పోషించారు. అది గెస్ట్ రోల్ లాంటిది. ఆ పాత్ర‌లో చేయాల‌ని న‌న్ను అడిగారు. ‘ఈ పాత్ర ఎంతో సేపు లేదు క‌దా.. నెగిటీవ్ షేడ్స్ ఉన్నా, హీరో పాత్రే బెట‌రేమో..” అన్నాను. అంతే.. వెంట‌నే ఆ సినిమా రైట్స్ కొనేశారు. ‘నేను మాట వ‌ర‌స‌కు అన్నాన‌య్యా’ అన్నా ప్రొడ్యూస‌ర్లు విన‌లేదు. వాళ్ల కోసం ఆ సినిమా చేశాను. కానీ నేను అనుకొన్న‌ట్టే సినిమా ఆడ‌లేదు. అప్ప‌టికి నా ఇమేజ్ అంతంత మాత్ర‌మే. అయినా న‌న్ను నెగిటీవ్ క్యారెక్ట‌ర్ల‌లో చూడ‌లేక‌పోయారు..” అని ఒక్క‌సారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లారు చిరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close