‘మన శంకర వర ప్రసాద్ గారు’ కంటే ముందు మొదలై, పూర్తయిన సినిమా ‘విశ్వంభర’. అయితే.. సంక్రాంతి సీజన్ ని లక్ష్యంగా చేసుకొని ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రూపొందించడంతో ‘విశ్వంభర’ వెనక్కు వెళ్లింది. దాంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా ఆలస్యం అవ్వడంతో.. రిలీజ్ డేట్లు మారుతూ వచ్చాయి. అది ‘విశ్వంభర’కు మంచే చేసింది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మంచి విజయాన్ని అందుకోవడం తో మార్కెట్ పరంగా వెసులుబాటు లభించింది. ఈ ఉత్సాహంతో… ‘విశ్వంభర’కు మంచి రేట్లు రావొచ్చు. ఈయేడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాల్సివుంది. అయితే డేట్ పరంగా దర్శక నిర్మాతలు ఇంకా ఓ క్లారిటీకి రాలేదు.
జూన్ – జులై అనువైన తేదీగా.. మేకర్స్ భావిస్తున్నారు. జులై 10న ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేసవి సీజన్ కాబట్టి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. షూటింగ్ పూర్తయినా, ఈ సినిమాకు సంబంధించిన సీజీ వర్క్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. సంక్రాంతి తరవాత.. ఆ పనులు వేగవంతం అయ్యాయి. మార్చి, ఏప్రిల్ నాటికి ఫస్ట్ కాపీ రెడీగా ఉంటుంది. సీజీ వర్క్స్ ఒకసారి చెక్ చేసుకొన్న తరవాత రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వస్తుంది. ఈలోగా ఓటీటీ మార్కెట్ కూడా క్లోజ్ చేయాల్సివుంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.
