చంద్రబాబుకు రెండు రోజుల సీఐడీ కస్టడీ

చంద్రబాబును రెండు రోజుల సీఐడీ కస్టడీకి అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. రెండు రోజులు రాజమండ్రి జైల్లోనే ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ చేయనున్నారు. విచారణ సమయంలో చంద్రబాబు తరపు లాయర్లు ఒకరిద్దరు అందుబాటులో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. విచారణ జరిపే అధికారుల పేర్లు ఇవ్వాలని జడ్జి ఆదేశించారు. అలాగే విచారణను రికార్డు చేయాలన్నారు.

ఆ వివరాలను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలన్నారు. విచారణ సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు రాకూడదని స్పష్టం చేశారు. చంద్రబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ ను సోమవారం చేస్తామని జడ్జి తెలిపారు. కస్టడీ పిటిషన్ పై ఇంతకు ముందే విచారణ పూర్తి చేశారు. కానీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు రాకపోవడంతో మూడు, నాలుగు సార్లు వాయిదా వేశారు. హైకోర్టులో తీర్పు రాగానే ఏసీబీ కోర్టు కూడా రెండు రోజుల కస్టడీకి ఇస్తూ తీర్పు వెలువరించారు. అంతకు ముందు హైకోర్టు క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు తరపు లాయర్లు 17A సెక్షన్ వర్తిస్తుందని వాదించారు. అయితే తీర్పులో ఆ చట్టం ప్రస్తావన ఎక్కడా తీసుకు రాలేదు. చట్టం వర్తింపుపై తీర్పులో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సాక్ష్యాలను పరిశీలించామని.. విచారణను ఈ దశలో ఆపలేమని తెలిపింది.

మరో వైపు అసలు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామే లేదని.. అందులో చంద్రబాబు ప్రమేయం లేదని .. గట్టిగా నమ్ముతున్న టీడీపీ లాయర్లు.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. లోకేష్ ఇప్పటికే ఢిల్లీలో న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. శనివారం కూడా హైకోర్టుకు పని దినమే. అయితే శనివారం పిటిషన్ వేస్తారా.. సోమవారమా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close