ఇద్ద‌రు ఫ్రెండ్స్ మ‌ధ్య చిచ్చు పెట్టిన వెబ్ సిరీస్‌

ఇటీవ‌ల `వ్య‌వ‌స్థ‌` అనే వెబ్ సిరీస్ వ‌చ్చింది. సిరీస్ బాగుంద‌ని అంద‌రి టాక్‌. ఈ సిరీస్‌కి… ఆనంద్ రంగా ద‌ర్శ‌కుడు. త‌న‌కి ఈ `వ్య‌వ‌స్థ‌` మంచి పేరే తీసుకొచ్చింది. అయితే ఇదే వెబ్ సిరీస్‌… ఇద్ద‌రి ఫ్రెండ్స్ మ‌ధ్య చిచ్చు రేపుతోంది.

ద‌ర్శ‌కుడు ఆనంద్ రంగా, ర‌చ‌యిత‌ రాజ‌సింహా ఇద్ద‌రూ మంచి మిత్రులు. ఇద్ద‌రూ కలిసి కొన్ని సినిమాల‌కు ప‌ని చేశారు. ప‌దేళ్ల క్రితం `బ్లాక్ కోట్‌` అనే క‌థ రాశాడు రాజ‌సింహా. అది మిత్రుడు ఆనంద్ రంగాతో పంచుకొన్నాడు. ఇద్ద‌రి మ‌ధ్యా ఇదే క‌థ గురించి డిస్క‌ర్ష‌న్లు న‌డిచాయి. అయితే.. ఇప్పుడు అదే క‌థ‌ని, రాజ‌సింహ అనుమ‌తి కూడా తీసుకోకుండా `వ్య‌వ‌స్థ‌` గా తీసేశాడు. రైట‌ర్‌గా.. త‌న పేరు వేసుకొన్నాడు. ఇది తెలిసి రాజ‌సింహ గొడ‌వ‌కు దిగితే, చివ‌రి క్ష‌ణాల్లో ర‌చ‌యిత‌గా పేరు మార్చారు. ఆనంద్ ప్లేసులో రాజ‌సింహ పేరు వ‌చ్చి చేరింది. అయితే రెమ్యున‌రేష‌న్ కూడా స‌రిగా ఇవ్వ‌లేదట‌. మాట‌లు కూడా రాజ‌సింహే రాశాడు. అయితే మ‌రో త‌మిళ ర‌చ‌యిత‌ని తీసుకొచ్చి, త‌నతో కొంత వ‌ర్క్ చేయించి, డైలాగ్ క్రెడిట్స్ కూడా రాజ‌సింహ‌కు రాకుండా చేశాడు. దాంతో.. రాజ‌సింహ‌కీ, ఆనంద్ రంగ‌కీ మ‌ధ్య గ్యాప్ మొద‌లైంది. ఈ వెబ్ సిరీస్ విష‌యంలో త‌న‌కు న్యాయం జ‌ర‌గాల‌ని రాజ‌సింహ ఇప్పుడు పోరాటం చేయ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నాడు. ఇండ‌స్ట్రీలో క‌థా చౌర్యం అతి సాధార‌ణ‌మైపోయింది. కాక‌పోతే.. స్నేహితుడి క‌థ‌ని త‌న క‌థ‌గా చెప్పుకొనే ప్ర‌య‌త్నం చేయ‌డం, క‌నీసం పారితోషికం కూడా ఇవ్వ‌కుండా త‌ప్పించుకోవ‌డం.. మాత్రం అన్యాయం. ఈ విష‌యంలో రాజ‌సింహ‌కి న్యాయం జ‌రుగుతుందో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close