టీ న్యూస్ చానల్‌ మూసేస్తారా ?

తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి టీ న్యూస్ చానల్ టీఆర్ఎస్ ఆఫీస్ నుంచే నడుస్తుంది. టీఆర్ఎస్ ఆఫీస్.. రాజకీయ కార్యక్రమాలు, పార్టీ ఆఫీస్ ను నడుపుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఉంది. అక్కడ వ్యాపారం చేయడం నిషిద్ధం. కానీ అడిగే వారు లేరు.. పాలకులు కూడా వారే కాబట్టి నడిచిపోయింది. పదకొండేళ్లుగా టీఆర్ఎస్ ఆఫీసు నుంచే టీ చానల్ రన్ అవుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అధికారులకు రూల్స్ గుర్తుకు వచ్చాయి. వెంటనే నోటీసులు జారీ చేశారు.

బీఆర్ఎస్ పార్టీ భవన్‌కు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయంలో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేయడంపై నోటీసులు ఇచ్చారు. పార్టీ ఆఫీస్ నుంచి టీ న్యూస్ ఛానల్‌ను ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వారంలోగా వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ భవన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డిని రెవెన్యూ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. కాగా 2011 నుంచి టీ న్యూస్ ఛానల్‌ను యాజమాన్యం బీఆర్ఎస్ భవన్‌లోనే నిర్వహిస్తున్నారని.. ఇది నిబంధనలకు విరుద్ధమని నోటీసుల్లో పేర్కొన్నారు.

నిజానికి టీ న్యూస్ చానల్ ను మార్చాలని చాలా కాలం క్రితమే అనుకున్నారు. నంది నగర్ లో కేసీఆర్ ఇంటి కి దగ్గరతో… బీసీ వేల్ఫేర్ హాస్టల్ పక్కన ఖాళీ స్థలంలో సెటిల్మెంట్ చేసి కొంత మొత్తం .. కేసీఆర్ బంధువులు రాయించుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. అందులో టీ చానల్ పెట్టాలనుకున్నారని చెబుతారు. కానీ ఎందుకో అది ఆగిపోయింది. ఇంకా ఎక్కడైనా ప్రణాళికలు రెడీ చేసుకున్నారో లేదో కానీ.. త్వరలో ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం చేసినందుకు తెలంగాణ భవన్ ను … సర్కార్ స్వాధీనం చేసుకున్నా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close