రఘురామ దివాలా !?

రఘురామకృష్ణరాజుపై 2019లో నమోదైన కేసులో సీబీఐ 2021 ముగియకుండానే చార్జిషీట్ దాఖలు చేసింది. ఇక విచారణ ప్రక్రియ పూర్తయితే రఘురామకు శిక్ష పడే చాన్స్ ఉంటుంది. రఘురామ కృష్ణరాజు ఇండ్ భారత్ పేరుతో విద్యుత్ కంపెనీలు పెట్టి… వాటి కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో పాటు బ్యాంకుల కన్సార్షియం వద్ద రుణాలు తీసుకున్నారు. కానీ విద్యుత్ ప్రాజెక్టులు కట్టలేదు. రుణాలు దారి మళ్లించారు. ఈ కారణాలతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కేసులు నమోదయ్యాయి. ఆయన ఇంటిపై గత ఎన్నికలకు ముందే సీబీఐఅధికారులు దాడులు చేశారు. ఇప్పుడు అది చార్జి షీట్ దాకా వచ్చింది.

ఈ రుణం ఎగవేత వ్యవహారాన్ని వీలైనంత వరకూ సాగదీయడానికి రఘురామ కంపెనీ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను కూడా ఆశ్రయించింది. అయితే ఎన్సీఎల్టీలో ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.బ్యాంకుల కన్షార్షియానికి రూ.1,383 కోట్లకు పైగా బాకీ పడినట్లుగా తేలింది. కొన్నాళ్లుగా బకాయిలు చెల్లించకపోవటంతో ఎన్‌పీఏగా బ్యాంకులు పేర్కొన్నాయి. దివాలా ప్రక్రియ చేపట్టాలంటూ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది.. బ్యాంకుల కన్సార్షియంలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్.

అయితే దివాలా ప్రక్రియకు అనుమతించవద్దంటూ రఘురామ కంపెనీ వాదించింది. ఆ వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి; దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతించారు. దివాలా పరిష్కార నిపుణుడ్ని నియమించారు. మూడు రోజుల్లో దివాలా పక్రక్రియ గడువుతో సహా వివరాలన్నీ తెలియజేయాలని ఆదేశించారు. ఇదే కేసులు సీబీఐ చార్జిషీటు కూడా దాఖలు చేయడంతో రఘురామకు కష్టాలు రెట్టింపుయినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close