“సీరం” వ్యాక్సిన్ ప్రజలకు భారమే ..!

కరోనా టీకా మధ్యతరగతి ప్రజలకు భారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా తయారు చేసిన వ్యాక్సిన్‌కు భారత్‌లో అమ్మకానికి ఆమోదం ఇచ్చారు. సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ ఇక్క మార్కెట్ చేసుకుంటోంది. ప్రభుత్వానికి రూ. రెండు వందలకు ఒక్క టీకా సప్లయ్ చేస్తున్న సీరం ప్రజలకు వచ్చే సరికి రూ. వెయ్యి వసూలు చేస్తామని చెబుతోంది. అది కూడా.. పన్నుల్లేకుండా. పన్నులతో కలిపి మరింత అదనం అవుతుంది. ఒక్క డోస్ తీసుకుంటే సరిపోదు.. రెండు డోసులు తీసుకోవాలి. అంటే.. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ… కనీసం రెండున్నరవేలు టీకా కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం టీకా ఫ్రీ అని ఇప్పటి వరకూచెబుతూ వచ్చింది. ఎక్కడ ఎన్నికలు జరిగితే.. అక్కడ టీకా ఫ్రీ అని బీజేపీ కూడా మ్యానిఫెస్టోల్లో పెట్టింది. చివరికి… టీకా అందుబాటులో కి వచ్చే సరికి .. అందరికీ కాదని చెబుతోంది. ఆరోగ్య కార్యకర్తలకు, కోవిడ్ వారియర్స్‌కు… వృద్ధులకు మాత్రమే ఉచితంగా ఇస్తామని మిగతా వారు కొనుగోలు చేయాల్సిందేనని ప్రకటించేసింది. ఈ వ్యాక్సిన్ వల్ల కొన్ని వేల కోట్ల వ్యాపారాన్ని అతి కొద్ది సమయంలోనే చేయడానికి సీరం ఇనిస్టిట్యూట్ సిద్ధమయింది. మార్కెటింగ్‌లో రాటుదేలిపోయిన ఈ సీరం ఓనర్ అదర్ పూనావాలా.. ఇతర వ్యాక్సిన్లపై నిందలేయడం.. అపనమ్మకం కలిగించడానికి కూడా అప్పుడే మార్కెటింగ్ స్ట్రాటజీ పాటించడం ప్రారంభించారు.

అవన్నీ వేడి నీళ్లు అంటూ రెచ్చిపోవడం ప్రారంభించారు. తర్వాత ఏదోవిధంగా సర్దుబాటు చేసుకున్నప్పటికీ.. ఓ అనుమాన బీజాన్నిఅయితే నాటేశారు. తక్కువకు వచ్చే వ్యాక్సిన్‌లు … నమ్మకమైనవి కాదన్నట్లుగా.. తమవి మాత్రమే… గొప్పవన్నట్లుగా చెప్పడం ప్రారంభించారు. రెండు డోసుల్ని .. ప్రతి ఒక్కరూ రెండు వేలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వంద కోట్ల మందిజనాభా… ఒక్కొక్కరు.. రెండు వేల రూపాయల్ని .. వచ్చే రెండు నెలల్లో వ్యాక్సిన్ కోసం వెచ్చిస్తే.. ఎన్ని వేల కోట్ల బిజినెస్ అవుతుందో… తెలిస్తే.. ప్రజలకు ఎంత భారం అవుతుందో అంచనా వేయడం కష్టమేమీ కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close