‘దర్బార్’ ట్రైల‌ర్‌: పోలీసా? హంత‌కుడా?

ఈ సంక్రాంతికి పోటీకొస్తున్న సినిమా `ద‌ర్బార్‌`. ర‌జ‌నీకాంత్ – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న‌చిత్రం కావ‌డంతో అంచ‌నాలు ఆకాశాన్ని తాకాయి. `స‌ర్కార్‌` త‌ర‌వాత మురుగ‌దాస్‌ నుంచి వ‌స్తున్న సినిమా ఇది. ఆయ‌న కూడా ఫామ్ లో ఉన్నాడు. ర‌జ‌నీని మురుగ‌దాస్ ఎలా చూపిస్తాడా అని అభిమానులంతా ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు `ద‌ర్బార్‌` ట్రైల‌ర్ కూడా వ‌చ్చేసింది.

ర‌జ‌నీ ఇందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించనున్నాడ‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే… ర‌జ‌నీ ఓ రౌడీ పోలీసు. ‘ఐ యామ్ ఏ బ్యాడ్ కాప్‌’ అనే ర‌జ‌నీ డైలాగ్‌ని బ‌ట్టి – ఈ సినిమాలో ర‌జ‌నీ క్యారెక్ట‌రైజేష‌న్ ఏమిటో అర్థం చేసుకోవొచ్చు. ర‌జ‌నీ స్టైల్‌, త‌న‌కు మాత్ర‌మే సొంత‌మైన మేన‌రిజం ఈసారి కూడా క‌నిపించాయి. మురుగ‌దాస్ సినిమాల్లో ఓ సోష‌ల్ మెసేజ్ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ని ఎంచుకున్నాడ‌నిపిస్తుంది. ముంబై పోలీస్ క‌మీష‌న‌ర్‌కీ, మాఫియా లీడ‌ర్‌కీ మ‌ధ్య జ‌రిగే క‌థ ఇది. షాట్లూ, మేకింగూ, యాక్ష‌న్ పార్టూ చూస్తుంటే ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు మురుగ‌దాసా? లేదంటే లింగుస్వామినా అనే అనుమానం కూడా వేస్తుంది. కాక‌పోతే.. ర‌జ‌నీ ఫ్యాన్స్ ఈ సినిమాతో పండ‌గ చేసుకుంటార‌న్న భ‌రోసా మాత్రం క‌లుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.