సుకుమార్‌కి అస్వ‌స్థ‌త‌

ద‌ర్శ‌కుడు సుకుమార్ అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్టు స‌మాచారం. ఆయ‌న తీవ్ర‌మైన జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నార్ట‌. దాంతో… `పుష్ష‌` షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. సుకుమార్ ముందు నుంచీ… ఇంగ్లీషు మందులు, ఇంజెక్ష‌న్లు, ట్రీట్మెంట్‌కి దూరం. ఆయ‌న హోమియోప‌తి వాడుతుంటారు. ఈసారి కూడా హోమియోప‌తి మందులే వాడుతున్నార్ట‌. ఆయ‌న ఆరోగ్యం కుదుట ప‌డేంత వ‌ర‌కూ.. `పుష్ష‌` షూటింగ్ లేన‌ట్టే. ప్ర‌స్తుతం ఆయ‌న ఇంటి ప‌ట్టునే విశ్రాంతి తీసుకుంటున్నారు. పుష్ష ని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. పార్ట్ 1ని ఈ యేడాదే విడుద‌ల చేస్తారు. పార్ట్ 1కీ పార్ట్ 2కీ క‌నీసం ఆరు నెల‌ల గ్యాప్ ఉంటుంది. ఈలోగా… బ‌న్నీ కి ఓ సినిమా చేయాల‌న్న ఆలోచ‌న ఉంది. కానీ సుకుమార్ మాత్రం.. పుష్ష 2 అయ్యేంత వ‌ర‌కూ బ‌న్నీని వ‌ద‌ల‌కూడ‌ద‌ని భావిస్తున్నాడు. క‌రోనా, లాక్‌డౌన్ ల వ‌ల్ల‌.. అన్ని సినిమాల‌తో పాటు పుష్ష షూటింగ్ కూడా ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. ఇప్పుడు సుకుమార్‌కి ఒంట్లో బాగోక‌పోవ‌డం వ‌ల్ల‌… మ‌ళ్లీ ఆగింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close