హ్యాపీ బర్త్ డే: ఇండస్ట్రీ హిట్లు కావాలి వినాయక్

కమర్షియల్ సినిమా తీయడం అంత ఈజీ కాదు. దాని లెక్కలు వేరు. దాని టెక్నిక్ వేరు. కమర్షియల్ సినిమా వర్క్ అవుట్ అయితే ఎంత సంచలనంగా వుంటుందో.. బెడిసికోడితే అంతే దారుణంగా వుటుంది. అయితే ఈ టెక్నిక్ ను ‘బ్లాక్ బస్టర్’ గా క్యాచ్ చేసిన దర్శకుడు వివి వినాయక్. క్లాస్ ఆడియన్స్ ను కూడా థియేటర్లో విజల్స్ వేయించగల నేర్పు వినాయక్ సొంతం. ఒక సీన్ చూస్తున్నప్పుడు పూనకం వచ్చినట్లు వూగిపోయేలా చేసేయగల దర్శకుడాయన. ”అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా”.. ఈ డైలాగ్ ఎన్టీఆర్ చెబుతుంటే.. థియేటర్ వచ్చిన రెస్పాన్స్ ఎలా మర్చిపోగలం. ‘ఆది’ నుండి మొదలైన వినాయక్ ప్రయాణం ‘ఖైదీ నెంబర్ 150’ వరకూ ఒక కమర్షియల్ సినిమాలానే సాగింది. థియేటర్ లోకి అడుగుపెట్టిన ప్రతీ ప్రేక్షకుడికి పైసా వసూల్ వినోదం ఇవ్వాలనే ఉద్దేశంతోనే సినిమాలు రూపుందించాడు వినాయక్. ఈ క్రమంలో తెలుగు తెరపై తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. మాస్ ఆడియన్స్ క్లాస్ ఆడియన్స్ అనే తేడా లేకుండా జనరంజకమైన సినిమాలు అదించాడు.

హీరోలను హ్యాండిల్ చేయడంలో కూడా వినాయక్ ది డిఫరెంట్ స్టయిల్. అన్నీ మాస్ మసాలా కమర్షియల్ సినిమాలే తీసిన.. అందులోనే వైవిధ్యం చూపించాడు వినాయక్. ఎన్టీఆర్ ని ‘ఆది’గా చూపించినా.. నితిన్ కి ‘దిల్’ తో ఓ హీరో ఇమేజ్ ఇచ్చినా.. అల్లు అర్జున్ ని ‘బన్నీ’ చేసేసినా.. మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ లాంటి సంచలనం నమోదు చేసినా.. వినాయక్ కే చెల్లింది. హీరోకి ఎంతటి ఇమేజ్ వున్నా ఆ ఇమేజ్ ను రెట్టింపు చేసేలా సినిమాలు తీయడం వినాయక్ ప్రత్యేకత. సాదారణంగా కమర్షియల్ అంటారు. అయితే కమర్షియల్ హిట్ తో పాటు ఓ హీరోకి కమర్షియల్ ఇమేజ్ ని క్రియేట్ చేయగల సత్తా వున్న దర్శకుడు వినాయక్.

అతి తక్కువ కాలంలోనే టాప్ స్టార్స్ ని డైరెక్ట్ చేశాడు వినాయక్. ఏ దర్శకుడికైనా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలనే కోరిక ఉటుంది. ఈ అవకాశం వినాయక్ కి బిగినింగ్ లోనే వచ్చేసింది. అయితే మెగాస్టార్ సినిమా అంచనాలు అందుకోవడం అంటే మాటలు కాదు. అయితే వినాయక్ మాత్రం అభిమానులకు కావాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు. అప్పటివరకూ వున్న ఇండస్ట్రీ రికార్డులను ఠాగూర్ తో చెరిపేశాడు. ఈ రకంగా మెగాస్టార్ చిరంజీవి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడిగా తన క్యాలిబార్ ను నిరూపించాడు.

వినాయక్ స్టామినాకి మరో నిదర్శనం మెగాస్టార్ 150 సినిమా. ఈ సినిమా దర్శకుడిపై జరిగిన కసరత్తు ఇంత ఇంతకాదు. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ మెగాస్టార్ తెరపై కనిపిస్తున్నారు. ఆయన చరిస్మాను చెక్కు చెదరకుండా చుపించాలి. మరి అలా చూపించగల దర్శకుడు ఎవరు? దీనిపై ఒక ఏడాది పాటు అన్వేషణ జరిగింది. అయితే మెగాస్టార్ గురి చివరికి వినాయక్ మీదే కుదిరింది. వినాయక్ అయితేనే న్యాయం చేయగలడని అనిపించింది. మెగాస్టార్ నమ్మకం వమ్ముకాలేదు. వినాయక్ మరోసారి భారీ అంచనాలు అందుకున్నాడు. మళ్ళీ ‘ఖైధీ నెంబర్ 150’తో మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ ఇచ్చిన దర్శకుడిగా నిలిచాడు వినాయక్.

అయితే ఇప్పుడు వినాయక్ టేకాప్ చేస్తున్న సినిమాలు ఆయనకు సరిపడవేమో అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ఖైధీ నెంబర్ 150 లాంటి సంచలన విజయం తర్వాత సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్నారు వినాయక్. అంతకుముందు కూడా బెల్లం కొండ శ్రీనివాస్ .. లాంటి హీరోలతో పనిచేశారు. ఏనుగు కుంభస్థాలాన్ని కొట్టే క్యాలిబర్ వున్న వినాయక్ ఈ మీడియం సినిమాలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదు. వినాయక్ నుండి ఇండస్ట్రీ హిట్లు ఆశిస్తారు. ఆయనకి ఆ కెపాసిటీ వుంది. ఆలాంటి వినాయక్ ఇలాంటి మీడియం సినిమాలతో సర్దుకుపోతున్నారేమిటో.. ?!

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. లతో వినాయక్ ఇంకా పని చేయలేదు. మహేష్ బాబు సినిమా ఎప్పటి నుండో చర్చల్లో వుంది. ఖైదీ నెంబర్ 150 తర్వాత ఆయన మహేష్ తో సినిమా వర్క్ అవుట్ చేస్తారేమో అని అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఇప్పుడు మీడియం సినిమాల వైపు మనసుపెట్టారు వినాయక్. చిరంజీవి, బాలకృష్ణ , వెంకటేష్.. ఎన్టీఆర్, అల్లు అర్జున్..రవితేజ .. ఇలా బడా స్టార్లకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చి ఇండస్ట్రీ రికార్డులను సెట్ చేసిన వినాయక్.. ఇప్పుడు ఇలా మీడియం సినిమాలు చేయడం ఆయన్ని అభిమానించే వారికే ఎదోలా వుంది. వినాయక్ లాంటి దర్శకుడి ద్రుష్టి ఎప్పుడూ బ్లాక్ బస్టర్ వైపు వుండాలి. త్వరలోనే మంచి కధలను సెట్ చేసుకొని.. మహేష్, పవన్ ,. ప్రభాస్, ఎన్టీఆర్.., కుదిరితే మళ్ళీ మెగాస్టార్ తో సినిమాలు చేయాలి. ఎందుకంటే.. వినాయక్ నుండి కోరుకునేది.. మీడియం సినిమాకాదు. ఇండస్ట్రీ హిట్లు.

హాపీ బర్త్ డే వినాయక్. ఈ రోజు వినాయక్ పుట్టినరోజు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.