మీడియా వాచ్‌: ఈ పేప‌ర్‌పై ఫోక‌స్ చేయ‌నున్న ఈనాడు

క‌రోనా దెబ్బ మీడియాపై గ‌ట్టిగా ప‌డింది. వంద‌లాది ఉద్యోగాలు ఊడిపోయాయి. జీతాలు క‌ట్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాలో తిరుగులేని `ఈనాడు` సైతం క‌రోనా ధాటికి విల‌విల‌లాడుతోంది. దిగువ స్థాయి ఉద్యోగుల్ని ఇప్ప‌టికే ఇంటికి పంపింది ఈనాడు. రిటైర్‌మెంట్ త‌ర‌వాత కూడా కొన‌సాగుతున్న సీనియ‌ర్ల‌నూ మ‌ర్యాద‌గా సాగ‌నంపింది. ఇప్పుడు లేటెస్టుగా స‌గం రోజుల పని – స‌గం రోజులు సెల‌వు అంటూ కొత్త విధానాన్ని ప్ర‌వేశ పెట్టి, ఆ విధంగానూ జీతాలు క‌ట్ చేస్తోంది.

ఇప్పుడు ప్రింటింగ్ పూర్తిగా మానేసి – కేవ‌లం ఈ- పేప‌ర్‌పై దృష్టి పెడితే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న చేస్తోంది. క‌రోనా వ‌ల్ల‌.. ఈనాడు స‌ర్క్యులేష‌న్ బాగా ప‌డిపోయింది. ఈనాడు అనే కాదు.. మిగిలిన పేప‌ర్ల ప‌రిస్థితి కూడా ఇంతే. పాఠ‌కులు ఈ – పేప‌ర్‌కి బాగా అల‌వాటు ప‌డుతున్నారు. యాడ్లు లేక‌పోవ‌డంతో ప్రింటింగ్ ఖ‌ర్చు భ‌రించ‌డానికి యాజ‌మాన్యాలు సిద్ధంగా లేవు. ఇటీవ‌ల జ‌రిగిన కీల‌క‌మైన స‌మావేశంలో ప్రింటిగ్‌పై దృష్టి త‌గ్గించి, ఈ పేప‌ర్ మ‌రింత మందికి చేరువ అయ్యేలా చూడ‌మ‌ని రామోజీరావు ఆదేశించార‌ని, ఒక ద‌శ‌లో ప్రింటింగ్ ఆపేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని, కానీ… చివ‌రి నిమిషంలో ఆ ప్ర‌తిపాద‌న ప‌క్క‌న పెట్టార‌ని, కొంత‌కాలం వేచి చూసి, ఆ త‌ర‌వాత నిర్ణ‌యం తీసుకుందామ‌ని కిర‌ణ్ లాంటి వాళ్లు స‌ర్ది చెప్పార‌ని తెలుస్తోంది. ఒక‌ట్రెండు నెల‌లు వేచి చూసి, ప‌రిస్థితి మెరుగు ప‌డ‌క‌పోతే… ప్రింటింగ్‌ని పూర్తిగా ప‌క్క‌న పెట్టాల‌ని ఈనాడు యోచిస్తోంది. ఈలోగా యాప్స్‌, ఈపేప‌ర్‌ని జ‌నంలోకి బాగా తీసుకెళ్లే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు. మీడియా సంస్థ‌ల్లో దిగ్గ‌జం లాంటి ఈనాడు ఇలాంటి ఆలోచ‌న‌ల్లో ఉందంటే.. మిగిలిన పేప‌ర్లూ అదే బాట ప‌ట్ట‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close