పిసరంత పీఆర్సీ..! కేసీఆర్ మార్క్ గేమా..!?

ఉద్యోగ సంఘాలు అడుగుతోంది 63 శాతం ఫిట్‌మెంట్. బిశ్వాల్ కమిటీ సిఫార్సు చేసింది ఏడున్నర శాతం. రెంటికి పోలిక కూడా లేదు. తెలంగాణ ఉద్యోగులు కొద్ది రోజులుగా వేతన సవరణ కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో 43 శాతం ఇచ్చారని ఈ సారి 63 శాతం ఆశిస్తున్నామని గతంలో ప్రకటనలు చేశారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్ కూడా.. దూరమైన వర్గాలను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తూండటంతో తమకు పీఆర్సీ భారీగానే ప్రకటిస్తారని ఉద్యోగులు ఆశిస్తూ వస్తున్నారు. ఆ కమిటీ రిపోర్ట్ బుధవారం బయటకు వచ్చింది. అందులో కేవలం ఏడున్నర శాతమే ఫిట్ మెంట్ .. ఇంటి అద్దె భత్యాన్ని తగ్గించాలని సిఫార్సు చేయడంతో ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు.

పీఆర్సీ నివేదికపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కూడా వివిధ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. సీఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఉద్యోగసంఘాలకు వివరించిన సీఎస్.. పీఆర్సీ ఫిట్‌మెంట్‌ విషయంలో సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఉద్యోగుల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పీఆర్సీపై సీఎం వద్ద తేల్చుకుంటామని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. అది పీఆర్సీ నివేదిక కాదు.. అది పిసినారి నివేదిక అని త్వరలో సీఎంను కలుస్తామని ప్రకటించారు.

మరీ ఏడున్నర శాతం ఫిట్ మెంట్ సిఫార్సు చేయడం కింది స్థాయి ఉద్యోగుల్ని కూడా ఆశ్చర్య పరిచింది. మరీ ఇంత తక్కువ ఇవ్వరని నమ్మకంగా ఉన్నారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అలాగే ఉంటాయి. మొదట పూర్తి స్థాయిలో నిరాదరణ చూపుతారు. చివరికి వారంతా ఆశలు వదులుకుంటున్న సమయంలో ఊహించనంత ఆదరణ చూపుతారు. దాంతో వారు పాలాభిషేకాలు చేస్తారు. అందుకే… పీఆర్సీ ఇంత తక్కువ సిఫార్సు చేసినా… ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పడానికి ప్రభుత్వం ఇలాంటి వ్యూహం అమలు చేస్తోందని.. కనీసం నలభై శాతం అయినా ఇస్తారని ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. పీఆర్సీ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా ఆడుతున్నారని విపక్ష నేతలు కొత్తగా విమర్శలు ప్రారంభించారు..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close