ఈ కంపెనీలపై ఐటీ దాడుల గురించి అందరూ సైలెంట్ !

హైదరాబాద్‌లో వ్యాపార వ్యవహారాలు ఎక్కువగా ఉన్న రెండు సంస్థలపై మూడు రోజుల కిందట ఐటీ అధికారులు దాడులు చేసారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులోనూ ఈ సోదాలు జరిగాయి. దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగినట్లుగా తేల్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్త చాలా మీడియాల్లో కనిపించడం లేదు. ఆ రెండు కంపెనీల పేర్లు నూజివీడు సీడ్స్, దివ్యశ్రీ రియల్ ఎస్టేట్స్. ఈ రెండింటి మధ్య వ్యాపార లావాదేవీల్లో గోల్ మాల్ జరిగిందని ఫిర్యాదులు రావడంతోనే ఐటీ అధికారులు సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే్ ఈ ఐటీ దాడులకు రాజకీయ పరిణామాలకు ఏమైనా సంబంధం ఉందా లేదా అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు . దివ్య శ్రీ రియల్ ఎస్టేట్స్ సంస్థ పెద్దగా ప్రచారం చేసుకోదు. కానీ హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో భారీ భవనాలు నిర్మించింది. బెంగళూరులోనూ పెద్ద ఎత్తున స్థిరాస్తి వ్యాపారం చేస్తుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో చక్రం తిప్పుతున్న బడా వ్యాపారి చేతి సంస్థేనని చెబుతూ ఉంటారు.

నూజివీడ్ సీడ్స్ యజమానికి కూడా అధికార పార్టీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూంటారు. ఈ క్రమంలో ఐటీదాడుల అంశం చాలా వరకూ మీడియా గోప్యత పాటించడంతో అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న అభిప్రాయం ప్రారంభమయింది. అయితే ఇలాంటి ఐటీ దాడులు గతంలో చాలా జరిగాయని… అంత మాత్రానే ఏదో జరిగిపోతుందని అనుకోవడం వేస్టని తెలంగాణ రాజకీయ వర్గాలు కూడా చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close