ప్రాజెక్ట్ కె: కిక్కు ఇవ్వ‌ని లుక్కులు

ప్రాజెక్ట్ కె పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాపై ముందు నుంచీ పాజిటీవ్ బ‌జ్ న‌డుస్తోంది. బాహుబలి రికార్డులు బ‌ద్ద‌లు కొట్టే స‌త్తా ఈ సినిమాకి ఉంద‌న్న‌ది అంద‌రి న‌మ్మ‌కం. క‌మ‌ల్ హాస‌న్, అమితాబ్ బ‌చ్చ‌న్‌, దీపికా ప‌దుకొణె లాంటి స్టార్ల‌తో ఈ సినిమా నింపేశారు. మ‌రింత మంది స్టార్లు ఈ సినిమాలో భాగం కానున్నారు. బ‌డ్జెట్ ప‌రంగా, క్రేజ్ ప‌రంగా, స్టార్స్ ప‌రంగా ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉంది ఈ సినిమా.

అయితే ప్రాజెక్ట్ కె నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన రెండు లుక్కులూ…. ప్ర‌భాస్ అభిమానుల్ని, సినీ ప్రేమికుల్ని, ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తి కన‌బ‌రుస్తున్న‌వారినీ ఏమాత్రం సంతృప్తి ప‌ర‌చ‌డం లేదు. ముందుగా దీపికా ప‌దుకొణె లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సినిమా కోసం ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దిన లుక్‌లా అణువంత కూడా అనిపించ‌ని ఫ‌స్ట్ లుక్ అది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవ‌డానికి దిగిన సెల్ఫీలా అనిపించింది. ఇది చూసి ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి కూడా నీర‌సాలు వ‌చ్చేశాయి.

ఇప్పుడు ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. యుద్ధ రంగంలో అడుగుపెట్టిన వీరుడిలా ప్ర‌భాస్‌ని ప‌రిచ‌యం చేశారు. జుల‌పాల జుత్తు, ఎవెంజెర్స్ టైపు ప‌ర్స‌నాలిటీతో ప్ర‌భాస్ రంగంలోకి దిగాడు. అయితే.. ఈ లుక్ సైతం ప్రామిసింగ్ గా లేదు. ఎవ‌రితో శ‌రీరానికి ప్ర‌భాస్ త‌ల తీసుకొచ్చి అతికించిన ఫీలింగ్ క‌లిగింది. దీనిపై కూడా మీమ్స్ మొద‌లైపోయాయి. నిజానికి… ప్ర‌భాస్ చేస్తున్న మిగిలిన సినిమాల కంటే దీనిపైనే ఎక్కువ బ‌జ్ ఉంది. స‌లార్ కంటే దీనిపైనే జ‌నాలు న‌మ్మ‌కాలు పెట్టుకొన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో వ‌చ్చిన ఈ లుక్స్‌.. ఫ్యాన్స్‌కు ఏమాత్రం కిక్ ఇవ్వ‌లేదు. స‌రిక‌దా, ఈ సినిమాపై తొలిసారి అనుమానాలు రేకెత్తించేలా త‌యార‌య్యాయి. కేవ‌లం లుక్స్ చూసి సినిమాపై ఓ అభిప్రాయానికి వచ్చేయ‌డం కూడా క‌రెక్ట్ కాదు. నాగ అశ్విన్ ఈ సినిమాని అంత‌ర్జాతీయ స్థాయిలో నిల‌బెట్ట‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. టీజ‌రో.. ట్రైల‌రో బ‌య‌ట‌కు వ‌స్తే కానీ మేట‌రేంట‌న్న‌ది తెలీదు. కాక‌పోతే.. ఈ లుక్స్ చూసి మాత్రం ఫ్యాన్స్‌కి నీర‌సం వ‌చ్చేయ‌డం మాత్రం నిజం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close