స్టెప్పులు కావాలి బ‌న్నీ…

తెలుగులోనే కాదు, ఆల్ ఇండియాలోనే బెస్ట్ డాన్స‌ర్ల‌లొ ఒక‌డు అల్లు అర్జున్‌. పూజా హెగ్డే అన్న‌ట్టు.. బ‌న్నీ ఓ తెలుగు మైఖెల్ జాక్స‌న్‌. బ‌న్నీ సినిమా అంటే కొత్త త‌రం స్టెప్పుల‌కు కొద‌వ ఉండన‌ట్టే. ఈ స్టెప్పు ఎలా వేశాడ‌బ్బా?? అంటూ అంతా ఆశ్చ‌ర్య‌పోయేలా మ్యాజిక్ చేయ‌డం బ‌న్నీకే సాధ్యం. త‌న కొత్త సినిమా డీజేలోనూ ఇలాంటి స్టెప్పుల కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌. అయితే.. విచిత్రంగా ట్రైల‌ర్ల‌లో బ‌న్నీ స్టెప్పులేం చూపించ‌లేదు. టీజ‌ర్ల‌లోనూ ఆ ఊసే లేదు. బ‌న్నీ డైలాగులు, మేన‌రిజం, ఫైట్లు, బిల్డ‌ప్పులు వీటిపైనే డీజే ట్రైల‌ర్ దృష్టి పెట్టింది. బ‌న్నీ మార్క్ స్టెప్ ఒక్క‌టీ క‌నిపించ‌క‌పోవ‌డం లోటు. సీటీ మార్ అనే పాట‌లో బ‌న్నీ భ‌యంక‌ర‌మైన స్టెప్పులు వేశాడ‌ని, ఈ సినిమా మొత్తానికి ఆ పాటే హైలెట్ అవుతుంద‌ని ముందు నుంచీ చిత్ర‌బృందం చెబుతూ వ‌స్తోంది. అయితే… ఆ పాట‌కు సంబంధించిన టీజ‌ర్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అందులోనూ సేమ్ క‌థ‌. బ‌న్నీ స్టెప్పులైతే ఉన్నాయి గానీ, ఆశ్చ‌ర్య‌ప‌రిచే రీతిలో, బ‌న్నీకి మాత్ర‌మే సాధ్య‌మ‌య్యే స్టెప్పులు ఏం క‌నిపించ‌లేదు. మ‌రోవైపు ఈ సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్నా – బ‌న్నీ మార్క్ స్టెప్పుల‌తో ఒక్క టీజ‌ర్ కూడా విడుద‌ల చేయ‌లేదు చిత్ర‌బృందం. స్టెప్పుల‌న్నీ థియేట‌ర్లోనే చూడాలేమో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.