ప్ర‌తీ టికెట్ నుంచి ఐదు రూపాయ‌లు రామమందిరానికే!

‘హ‌నుమాన్‌’ టీమ్ ఓ కీల‌క‌మైన నిర్ణ‌యాన్ని తీసుకొంది. ఈ సినిమా కోసం తెగే ప్ర‌తీ టికెట్ నుంచి వ‌చ్చే ఆదాయంలో రూ.5 అయోధ్య రామ‌మందిరం కోసం విరాళంగా ప్ర‌క‌టించింది. ఈరోజు హైద‌రాబాద్ లో ‘హ‌నుమాన్‌’ ప్రీ రిలీజ్ వేడుక నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయ‌న ద్వారా… హ‌నుమాన్ టీమ్ ఈ నిర్ణయాన్ని ప్ర‌క‌టించింది. అయోధ్య‌లో రామ‌మందిరం ప్రారంభిస్తున్న ఈ త‌రుణంలోనే `హ‌నుమాన్‌` వ‌స్తోంది. అందుకే.. ‘హనుమాన్‌’ టీమ్ ఈ నిర్ణ‌యం తీసుకొంది.

”అయోధ్య‌లో నిర్మించిన రామ‌మందిరం చ‌రిత్ర‌లో నిలిచిపోయే అపురూప‌మైన ఘ‌ట్టం. ఈ విశిష్ట పుణ్య కార్యానికి ఎవ‌రు ఏ రూపంలో అయినా స‌హాయం అందించొచ్చు. ‘హ‌నుమాన్‌’ టీమ్ తీసుకొన్న ఈ నిర్ణ‌యం చాలా గొప్ప‌ది. ఆపుణ్యం ఈ టీమ్ కి ద‌క్కుతుంది. ఓ వ‌రం అవుతుంది” అని చిరంజీవి ప్ర‌శంసించారు. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం ఈనెల 12న విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. 11 నుంచే ప్రీమియ‌ర్ షోల హ‌డావుడి మొద‌లు కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close