మోహన్‌బాబు భూములకు అధికార “పట్టా”

చంద్రగిరిలో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు డీకేటీ పట్టా భూములు కలిగి ఉన్నారని తేలింది. వెంటనే ఈ అంశంపై దుమారం రేగింది. కానీ మోహన్ బాబు, మంచు విష్ణు స్పందించలేదు. దీనిపై వారు నేరుగా ఏపీ అధికారులతోనే సంప్రదించినట్లుగా కనిపిస్తోంది. మూడు రోజుల తర్వాత రామిరెడ్డి పల్లి అనే గ్రామానికి సంబంధించిన రికార్డులను పరిశీలించిన తహశీల్దార్.. అవి డీకేటీ భూములు కాదు పట్టా భూములేనని తేల్చారు. ఈ మేరకు మీడియాకు సమాచారం ఇచ్చారు. మరి రికార్డుల్లో డీకేటీ భూములని ఎందుకని ఉన్నాయంటే… ఆన్‌లైన్‌లో మార్చలేదని అందుకే సమస్య వచ్చిందని చెబుతున్నారు.

మంచు మోహన్ బాబు, విష్ణు వర్ధన్ లు ఆ భూములు కొనుగోలు చేశారని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అయితే కొనుగోలు చేయడానికి ముందు అవి డీకేటీ భూములు. అవి ప్రభుత్వ భూములు. గతంలో బడుగు, బలహీనవర్గాల వారికీ సాగు చేసుకోవడానికి ఇచ్చారు. తర్వాత వారు వాటిని అమ్ముకున్నారు. ఇలా పది మందికిపైగా చేతులు మారయట. ఆ తర్వాత మోహన్ బాబు కుటుంబం చేతికి వచ్చాయి. సాధారణంగా డీకేటీ భూములు అమ్మితే .. కొనుగోలు చేసిన వారికి పట్టాలివ్వరు.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని.. సెంట్ ఇళ్ల స్థలాల కింద పంపిణీ చేస్తుంది. గత రెండేళ్లుగా ఇలాంటి కొన్ని వేల ఎకరాల్ని స్వాధీనం చేసుకుంది.

కానీ మోహన్ బాబు కు మాత్రం పట్టాలు జారీ చేసినట్లుగా ప్రభుత్వ అధికారులు చెప్పారు. అవి పట్టా భూములుగా మారాయన్నారు. అంటే డీకేటీ భూములను క్రమబద్దీకరించి పట్టా భూములుగా మార్చారన్నమాట. మామూలుగా ఇలాంటి ఆరోపణలు ఏ అధికార పార్టీ నేత మీదనో వస్తే వెంటనే ఆ భూముల్లో ప్రభుత్వ భూమి అని బోర్డు ఉండేది కానీ మోహన్ బాబు ఫ్యామిలీ అదృష్టవంతులు కాబట్టి అధికారులే స్పందించి పట్టా భూమి అని క్లారిటీ ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close