ఈ అఫిడవిట్ల రచ్చ ఎందుకు..? కేంద్రానిది మైండ్‌గేమా…?

తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి.. ఎప్పుడో విభజన హామీలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. చాలా రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వంపై దానిపై ఒక్కొక్కటిగా అఫిడవిట్లు దాఖలు చేయడం ప్రారంభించింది. అదీ కూడా.. ఒకేసారి కాకుండా.. శాఖల వారీగా… ఒకదానికి ఒకటి పొంతన లేకుండా.. అసత్యాలు.. అర్థసత్యాలు… పాత సమాచారంతో అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు. ఒక్కో అఫిడవిట్ బయటకు వచ్చినప్పడల్లా.. ఏపీలో కలకలం రేపుతోంది. ఎందుకంటే… కేంద్రమంత్రులు బయట చెప్పేది ఒకటి ఉంటే… అఫిడవిట్‌లలో మరొకటి ఉంటోంది. సాధారణంగా మంత్రులు బయట చెప్పేవి హామీలు అవుతాయి. వాటిని నమ్మలేం. కానీ సుప్రీంకోర్టుకు చెప్పేది అధికారికంగా వాటిని నమ్మి తీరాలి. అందుకే అఫిడవిట్ దాఖలు చేసినప్పుడల్లా ఏపీలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ… ఎప్పుడైతే.. కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని అఫిడవిట్ దాఖలు చేసిందో.. అప్పట్నుంచి రచ్చే. ఆ అఫిడవిట్ వల్ల రేగిన కసితో… సీఎం రమేష్ పదకొండు రోజుల పాటు దీక్ష చేశారు. అందులో అంతా పాత సమాచారమే ఉందని… టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ప్రత్యేకహోదా దగ్గర్నుంచి నిన్నామొన్నటి రైల్వేజోన్ వరకూ ఏ ఒక్క అఫిడవిట్ కూడా.. ఏపీ ప్రజల అంచనాలను అందుకోలేకపోయింది. చివరికి సోమవారం కూడా.. కేంద్ర మానవ వనరుల శాఖ ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులోనూ… కడుపు మండిపోయే విషయాలే పొందు పరిచింది హెచ్‌ఆర్డీ మినిస్ట్రీ.

అనంతపురంలో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఎప్పుడో కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. ఇక పార్లమెంట్ లో ప్రవేశపెట్టడమే మిగిలింది. ప్రస్తుత సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి.. ఆగస్టు నుంచి క్లాసులు నిర్వహిస్తామని… హెచ్ఆర్డీ మంత్రి ప్రకాష్ జవదేకర్ రాజ్యసభలో జరిగిన స్వల్పల కాలిక చర్చలో చాలా స్పష్టంగా చెప్పారు. కానీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో మాత్రం ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీ బిల్లు ఇంకా తమ శాఖ పరిశీలనలోనే ఉందని అఫిడవిట్ లో తెలిపారు. ఇతర శాఖలు దాఖలు చేసిన అఫిడవిట్ల మాదిరిగానే.. సగం, సగం సమాచారమే .. ఇందులోనూ ఉంది.

కేంద్రం ఇలా ఎందుకు తప్పుడు వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ అఫిడవిట్ల వ్యవహారం.. ఏపీ బీజేపీ నేతలకు కూడా ఇబ్బందికరంగా మారుతోంది. వారికి ఎలా సమర్థిచుకోవాలో అర్థం కావడం లేదు. అవన్ని పాత వివరాలని..మళ్లీ రివైజ్ చేసి అఫిడవిట్ దాఖలు చేస్తారని చెప్పుకొస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం… ఎలాంటి స్పందనా వ్యక్తం చేయడం లేదు. కచ్చితంగా ఏపీ ప్రజలను రెచ్చగొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్లను సమయం చూసి మరీ కోర్టులో సమర్పిస్ోతందన్న అనుమానాలు ఏపీ ప్రజల్లో ప్రారంభమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close