ప్రభుత్వాల సమయస్ఫూర్తితో విశాఖకు ఊపిరి..!

విశాఖ గ్యాస్ ప్రమాదం జరిగిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన.. ప్రజల్ని మెప్పించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాద వార్త తెలిసిన వెంటనే.. విశాఖ కలెక్టర్‌కు ఫోన్ చేసి.. తక్షణం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహిస్తూనే.. నేరుగా.. విశాఖ చేరుకున్నారు. చాలా వేగంగా.. బాధితుల్ని పరామర్శించడమే కాదు.. ఎవరూ ఊహించని విధంగా.. నష్టపరిహార ప్రకటన చేశారు. విపక్ష పార్టీలు.. రూ. పాతిక లక్షల వరకే మృతుల కుటుంబాలకు ఇవ్వాలనే డిమాండ్లు చేయడం ప్రారంభించాయి. కానీ జగన్మోహన్ రెడ్డి.. ఏకంగా రూ. కోటి ప్రకటన చేశారు. దీంతో విపక్ష పార్టీల నేతలు కూడా.. జగన్మోహన్ రెడ్డిని అభినందించడం ప్రారంభించారు. ప్రకటించినంత వేగంగా.. ఆ సాయం కుటుంబాలకు అందించాలని కోరుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి స్పందన చాలా మందిని మెప్పించింది. అదే సమయంలో రాష్ట్ర అధికార యంత్రాంగం కన్నా… సహాయ చర్యల విషయంలో.. కేంద్రమే చురుగ్గా స్పందించింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఎన్డీఆర్ఎఫ్, నేషలన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధారిటీ ఎన్‌డీఎంఏ… ప్రమాద వార్త తెలిసిన వెంటనే యాక్టివ్ అయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఏ చీఫ్‌లు.. ఢిల్లీలో కూర్చునే పరిస్థితిని సమీక్షించారు. హుటాహుటిన తమ బృందాలను వైజాగ్‌కు పంపించారు. నిజానికి.. గ్యాస్ లీక్ తెల్లవారుజామున రెండు, మూడు గంటల సమయంలో జరిగింది. దాన్ని కట్టడి చేయలేకపోవడంతోనే..ఉదయానికి పెద్ద ఎత్తున బాధితులయ్యారు. నిజానికి ఇలా కట్టడి చేయడానికి తగినంత వ్యవస్థ ఏపీ పోలీసుల వద్ద కానీ..అధికారయంత్రాంగం వద్ద కానీ లేదు. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే వారు కూడా బాధితులయ్యారు. ఈ సిట్యూటేషన్‌ని డీల్ చేయాలంటే.. ఖచ్చితంగా కేంద్ర సాయం కావాల్సిందేనని… జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాల్సిందేనని.. తేలిపోయింది.. ఈ సమాచారం కేంద్రానికి తెలిసిన వెంటనే.. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే… రంగంలోకి దిగిపోయారు.

ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఏ బృందాలు వచ్చిన తర్వాతనే విశాఖలో కాస్త వాతావరణం కుదుటపడిన పరిస్థితి కనిపించింది. వారికి పక్కా రక్షణ ఏర్పాట్లు ఉండటంతో… ఆనందపురం చుట్టుపక్కల గ్రామాలన్నంటినీ జల్లెడపట్టారు. గ్యాస్ ప్రభావంతో ఎవరైనా అస్వస్థతకు గురయ్యారేమో ఇంటింటికి సెర్చ్ చేసి మరీ బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు. అంతుక మించి.. అసలు ఎల్జీ పాలిమర్స్‌లో ఎంత మంది ఉన్నారు.. ఎంత మంది ఇరుక్కుపోయారు.. వారి పరిస్థితి ఏమిటన్నది ఉత్కంఠగా మారింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలే ఫ్యాక్టరీలో ఉన్న కొంత మందిని బయటకు తీసుకు వచ్చి.. ఆస్పత్రికి తరలించాయి.

కేంద్ర బృందాలు వచ్చే వరకూ రాష్ట్ర యంత్రాంగం.. టెన్షన్‌లో పడిపోయింది. అయితే.. ఆ తర్వాత కేంద్ర బృందాలతో సమన్వయం చేసుకుని.. ప్రజలకు భరోసా ఇవ్వగలిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగాలు సమర్థంగా .. సమన్వయంతో పని చేస్తే.. డిజాస్టర్ అవుతాయనుకున్న ఘటనలు కూడా.. కాస్త తక్కువ నష్టంతో బయటపడే అవకాశం ఉందని.. విశాఖ గ్యాస్ ప్రమాద ఘటన నిరూపించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close