బాల‌య్య‌కు ఓ క‌థ కావాలి

హారిక హాసిని సంస్థ‌లో నంద‌మూరి బాల‌కృష్ణ ఓ సినిమా చేయాల్సివుంది. అన్నీ కుదిరితే.. `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్` రీమేక్‌లోనే ఆయ‌న చేసేద్దురు. కానీ కుద‌ర్లేదు. కానీ బాలయ్య ఇచ్చిన కాల్షీట్లు మాత్రం ఆ సంస్థ ద‌గ్గ‌ర ఉన్నాయి. అందుకే బాల‌య్య కోసం ఓ క‌థ సిద్ధం చేసే ప‌నిలో ప‌డింది హారిక – హాసిని. అందుకోసం బ‌డా రైట‌ర్ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌ని టాక్. బాల‌య్య ప్ర‌స్తుతం `అఖండ‌` తో బిజీ. ఆ త‌ర‌వాత‌…. గోపీచంద్ మ‌లినేని సినిమా ఉంటుంది. ఇది ఈ యేడాదే మొద‌లైపోతుంది. హారిక – హాసిని సినిమా 2022లో మొద‌ల‌వుతుంది. అయితే ఈలోగా క‌థ లాక్ చేసుకోవాల‌న్న‌ది హారిక హాసిని సంస్థ ఆలోచ‌న‌. అయితే హారిక ముందున్న స‌మ‌స్య ఒక‌టే. బాల‌య్య‌ను డీల్ చేయ‌డానికి స‌రైన ద‌ర్శ‌కుడు లేడు. బ‌డా ద‌ర్శ‌కులంతా వాళ్ల వాళ్ల ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. కొత్త ద‌ర్శ‌కుడికి ఛాన్స్ ఇచ్చి – రిస్క్ చేసేంత ధైర్యం హారిక‌కు లేదు. ముందు క‌థ ఒక‌టి సెట్ చేసుకుంటే, ఆ త‌ర‌వాత ద‌ర్శ‌కుడ్ని వెదుక్కోవ‌చ్చ‌నేది వాళ్ల ప్లాన్‌. అందుకే.. యువ ర‌చ‌యిత‌లు, సీనియ‌ర్ ర‌చ‌యిత‌లు, ఫామ్ లో ఉన్న ర‌చ‌యిత‌లు… ఇలా అంద‌రి ద‌గ్గ‌రా బాల‌య్య‌కు స‌రిప‌డా క‌థ గురించి వాక‌బు చేస్తున్నారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ద‌గ్గ‌ర బాల‌య్య కు స‌రిప‌డా ఒక‌ట్రెండు క‌థ‌లున్నాయి. మ‌రి వాటిలో ఏదైనా ఒక‌టి సెట్ అవుతుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ ఫోకస్

కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ ల పునరుద్దరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నేటి కేబినెట్ సమావేశానికి ఈసీ నుంచి అనుమతి వస్తుందేమోనని ఇంకా వెయిట్ చేస్తోన్న ప్రభుత్వం... అటు...

మరికాసేపట్లో భారీ వర్షం…ఎవరూ బయటకు రావొద్దని అలర్ట్..!!

హైదరాబాద్ లో మరికాసేపట్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. క్యూములోనింబస్ మేఘాల కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close