ఓటేస్తున్నారా ? : పోలవరం వైపు ఓ సారి చూడండి !

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కరువులో నిండా మునిగిపోవాలో.. కనీసం రైతుల కడుపు నింపుకోవాలో తేల్చుకోవాల్సిన సంధి స్థితిలో ఉంది. ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు. గతంలో ఓట్లు వేశారు. ఐదేళ్లలో ఏం జరిగిందో కాస్త విశ్లేషించుకుని తమ ఓటును వేయాల్సి ఉంది. ఈ క్రమంలో రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు ఐదేళ్లలో ఎంత మేర పూర్తయింది.. ఆ ప్రాజెక్టుకు ఆ దుస్థితి ఎందుకు వచ్చింది అన్న సంగతి కూడా విశ్లేషించుకోవాలి.

2014-19 మధ్య పరుగులు పెట్టిన పోలవరం ప్రాజెక్ట్

విభజన చట్టంలో ఏపీకి దక్కింది ఏదైనా ఉంది అంటే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా మాత్రమే. జాతీయ హోదా ప్రాజెక్టులు 30, 40 ఏళ్లుగా కడుతూనే ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ పోలవరం అలా కాకూడదన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం వెంటనే నిర్మాణం ప్రారంభించింది . ఓ ప్రాజెక్టు వేగంగా నిర్మించాలంటే .. డిజైన్ల అనుమతుల దగ్గర నుంచి ఎన్నో రకాల హార్డిల్స్ ఉంటాయి. అన్నింటినీ ఓ మెకానిజంతో ఏకకాలంలో అధిగమిస్తూ నిధుల కొరత రాకుండా పోలవరాన్ని పరుగులు పెట్టించింది నాటి ప్రభుత్వం ఫళితంగా ప్రాజెక్టు ఓ రూపానికి వచ్చింది. 72 శాతం వరకూ పూర్తయింది.

2019 నుంచి పూర్తిగా పనులు నిలిపివేత

చంద్రబాబునాయుడు సీఎంగా దిగిపోగానే.. జగన్ పీఠమెక్కారు. అలా ఎక్కిన తర్వాత ఆయన చేసిన విధ్వంసంలో పోలవరం ఒకటి. పోలవరం కాంట్రాక్టర్ ను మార్చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కమిషన్లు ముట్ట చెప్పే మేఘా సంస్థకు ఐదు వందల కోట్లు తక్కువకు అంటూ ఇచ్చారు. కానీ ఇప్పటికీ అంచనాలు ఐదారువేల కోట్లు పెంచారు. అయినా పనులు పూర్తయ్యాయా అంటే లేదు.. అంతకు ముందు ఉన్న నవయుగ సంస్థ ప్రపంచంలో ఉన్న అత్యాధిక టెక్నాలజీని తెచ్చి నిర్మించిది. కానీ మేఘా సంస్థకు పంప్ హౌస్ లు కట్టడం తప్ప డ్యాములు కట్టిన అనుభవం లేదు. ఫలితంగా.. నిర్మాణంలో నిర్లక్ష్యం కనిపించింది. ఫలితంగా గైడ్ బండ్ ధ్వంసం అయింది. డయాఫ్రంవాల్ కూడా దెబ్బతిన్నది. వేగంగా పనులు పూర్తి చేసి ఉంటే.. ఏ సమస్యా వచ్చేది కాదు. కానీ కుల పిచ్చతో..డబ్బు పిచ్చతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేసే స్థితికి తీసుకు వచ్చారు.

ఏడాదిలో పూర్తి చేస్తామని తొడకొట్టారు.. ఐదేళ్ల తర్వాత మరో ఐదేళ్లంటున్నారు !

గతఎన్నికలకు ముందు ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రజలకు చెప్పారు. కేంద్రం డబ్బులివ్వకపోతే మీకు చేతకాదా అంటూ పెద్ పెద్ద డైలాగులు చెప్పారు. చివరికి అధికారంలోకి వచ్చాక తాము ఎంత చేతకాని వాళ్లమో నిరూపించుకున్నారు. నోటిపారుదల మంత్రులుగా పేరు తెచ్చుకున్న ఇద్దరు అనిల్ కుమార్, అంబటి రాంబాబు పోలవరంపై కనీస అవగాహన లేని నేతలు. ఏడాదిలో పూర్తి చేయకపోతే మీసం తీయించుకుంటానని అనిల్ కుమార్ తొడకొట్టారు. తర్వాత అంబటి రాంబాబు.. అసలు పోలవరం పూర్తవుతుందో లేదో తెలియదని మాట్లాడటం ప్రారంభించారు. అంటే ఏపీ జీవనాడి పీకనొక్కేసినట్లు. ఇప్పుడు ఐదేళ్లలో పూర్తి చేస్తామని నంగి కబుర్లు చెబుతున్నారు.

రూ. 12 లక్షల కోట్ల అప్పులో రూ. 30వేల కోట్లు పెడితే పూర్తయ్యేది !

పోలవరం ప్రాజెక్టుకు అసలు నిధులు సమస్యే కాదు. ఖర్చు పెట్టిన ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది. ఏపీ ప్రభుత్వం పన్నెండు లక్షల కోట్లనుఅప్పు చేసింది. అందులో రూ. 30వేల కోట్లను ఖర్చు పెట్టి ఉంటే… ప్రాజెక్టు ఈ పాటికి సాకారం అయ్యేది. కానీ.. ఈ సర్కార్ లక్ష్యం.. ఏపీ విధ్వంసం. ప్రజలు ఆకలితో బాధపడాలి.. వారికి తాను రేషన్ బియ్యం ఇవ్వాలి.. ఆ కృతజ్ఞతతో తనకే ఓట్లు వేయాలన్న దుర్భుద్ది. ఫలితంగా ఏపీలో అన్నింటినీ మూలన పడేసినట్లు పోలవరాన్ని పడేశారు. ఇంకో సారి చాన్సిస్తే మరోసారి పునరుద్ధరించడానికి వీల్లేకుండా చేసి.. చేతకాలేదని చేతులెత్తేస్తారు. చేతనైనవే చెబుతామని చేతులూపుకుంటూ మళ్లీ ప్రజల ముందుకు వస్తారు. నిర్ణయం ప్రజలదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close