రివ్యూ : పక్కా కమర్షియల్ డ్రామా ‘హైపర్’

నేను శైలజ వంటి సూపర్ హిట్ మూవీ తరువాత ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌, డైరెక్షన్ లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకరలు నిర్మించిన యాక్షన్‌ ఫామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హైపర్‌’ ఉప శీర్షిక ‘ప్రతి ఇంట్లో ఒకడుంటాడు’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 30న దేవి నవరాత్రుల సందర్భంగా విడుదల చేసారు. దసరా సీజన్ లో ఓ క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్యన, పెద్ద ఎత్తున విడుదలై ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుందీ? సమీక్ష లో తెలుసుకుందాం.

కథ:

సూర్య అలియాజ్ సూరి (రామ్) ఓ ఎనర్జిటిక్ కుర్రాడు. నిజాయితీగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి నారాయణ మూర్తి (సత్య రాజ్) కొడుకైన సూరికి తండ్రంటే ఎక్కడిలేని ప్రేమ. తండ్రి బాగుకోసం ఎంతటిదూరమైనా వెళుతుంటాడు. అతని మీద ఈగ ను కూడా వాలనియ్యడు. ఒక నొక సందర్భం లో వైజాగ్ లో పేరొందిన డాన్ గజా (మురళి శర్మ) సూర్య తండ్రి నారాయణ మూర్తి ని ఓ ప్రమాదం నుండి రక్షిస్తాడు. ఆ కృతజ్ఞతతో సూర్య గజా కు సహాయ పడుతుంటాడు. ఇక రిటైర్మెంట్‌కు దగ్గర పడిన సమయంలో నారాయణ మూర్తికి రాజప్ప (రావు రమేష్) అనే ఓ మినిష్టర్ నుంచి ఇబ్బంది తలెత్తుతుంది. వైజాగ్‌లో తాను కట్టే కమర్షియల్ కాంప్లెక్స్‌కు పర్మిషన్ ఇవ్వాలంటూ నారాయణ మూర్తిపై రాజప్ప ఒత్తిడి తెస్తాడు. కాగా నిజాయితీకి మారుపేరైన నారాయణ మూర్తి కాంప్లెక్స్ పర్మిషన్ కి ఒప్పుకోడు. ఆ తర్వాత ఏం జరిగింది? నారాయణ మూర్తి కొడుకు సూర్య ఈ విషయం తెలుసుకొని ఏం చేశాడు? మినిష్టర్ రాజప్పను సూర్య ఎలా ఎదుర్కొన్నాడు? ఈ కథలో భానుమతి (రాశి ఖన్నా) పాత్ర ఏంటి ? లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

రామ్ తన ఎనర్జీతో మరోసారి ఎనేర్జిస్టిక్ స్టార్ గా పేరు నిలపెట్టుకున్నాడు కామెడీ, యాక్షన్, డ్యాన్స్.. ఎక్కడా తగ్గకుండా లవర్ బాయ్ గా రామ్ సినిమాను ఆధ్యంతం ఉత్సాహం గా నడిపించాడు. ముఖ్యంగా పంచ్ డైలాగ్స్ విషయంలో తన పవర్ చూపించాడు. రాశిఖన్నాక్యూట్‌గా మంచి గ్లామర్ గా వుంది. కొన్నిచోట్ల తన అందాలతో కనువిందు చేస్తూ కూడా కుర్రకారు ని ఆకట్టుకుంది. ఇక రావు రమేష్‌ పాత్ర ఈ సినిమాకు ఓ ప్రధాన బలంగా చెప్పుకోవాలి.కామెడీకి కామెడీ పండిస్తూనే విలన్‌గా రావు రమేష్ కట్టిపడేశాడు. ఎలాంటి పాత్రనిచ్చినా తన ప్రెజెన్స్‌తో సినిమానే మరోస్థాయికి తీసుకెళ్ళగలనని రావు రమేష్ ఈ సినిమా తో మరో సారి ప్రూవ్ చేసుకున్నాడు.ఒక హుందా పాత్రలో తండ్రి పాత్రలో సత్యరాజ్ తన స్థాయికి తగ్గ నటన ప్రదర్శించాడు. ఇక మురళి శర్మ తన స్టైల్ నటనతో ఆకట్టుకున్నాడు.

సాంకేతిక వర్గం:

ప్రధానంగా దర్శకుడు సంతోష్ శ్రీన్‌వాస్‌ గురించి చెప్పుకుంటే, తన తొలి చిత్రం కందిరీగ లో వున్నా ఫ్లేవర్ ఈ చిత్రం లో మళ్ళి కనపడింది. ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఏయే అంశాలు ఉండాలో వాటన్నింటినీ చూసుకుంటూ మంచి స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో తన ప్రతిభను పూర్తి గా కనపరిచాడు. రామ్ లాంటి హీరోతో, పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో ఒక కొత్తదనమున్న ఎలిమెంట్ తో సినిమా తీయాలన్న ఆలోచనను సంతోష్ పెర్ఫెక్ట్ గా పర్సెంట్ చేయగలిగాడు. అయితే హీరో, హీరోయిన్ల లవ్‌ట్రాక్ సరిగ్గా లేకపోవడం, సెకండాఫ్‌లో కొన్ని అనవసరమైన పాటలు పెట్టడం లాంటి విషయాల్లో సంతోష్ పొరపాట్లు కనపడ్డాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అబ్బూరి రవి అందించిన మాటలు పరవాలేదు. జిబ్రాన్ అందించిన సంగీతం ఓకె. అయితే మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. గౌతమ్ రాజు ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో కాస్త స్పీడ్ తగ్గినట్టుగా వుంది. 14 రీల్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ :

కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌లో అసలు కథ చాలా సినిమా లలో పాత కథే ఉంటుంది. అయితే కొత్త ఎమోషన్‌ను, కొత్తదనమున్న నెరేషన్‌తో చెప్తే విజయం సాధిస్తాయని ఇదే కమర్షియల్ హంగులతో నిర్మించిన సినిమాలు సక్సెస్ కొడుతున్నాయి. ఈ ఫార్ములా నే నమ్ముకుని తయారు చేసుకున్న కథే ‘హైపర్’. ఆల్రెడీ అందరికి తెలిసిన పాత కథ లోనే తండ్రంటే విపరీతమైన ప్రేమ ఉండే హీరో క్యారెక్టరైజేషన్‌ను, జతచేసి, ఎక్కడా కామెడీ తగ్గకుండా, కథలోని ఎమోషన్‌ను ఎక్కడ తగ్గ కుండా జాగ్రత్త పడటం లో కాస్త కొత్తగా అనిపిస్తుంది. స్ర్కీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధానం. తండ్రంటే విపరీతమైన ప్రేమ ఉండే హీరో నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, గజ అన్న రౌడీతో హీరో ఫ్రెండ్‌షిప్ ఇలా వీటన్నింటినీ ఒక కొత్తదనమున్న స్క్రీన్‍ప్లేతో చెప్పిన విధానం బాగుంది. ఇక ఇంటర్వెల్ బాంగ్ కూడా అదిరిపోయేలా ఉంది. మొదట్నుంచీ చివరివరకూ కామెడీ ఎక్కడా తగ్గకుండా ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడం, కామెడీ విషయం లో సెపరేట్ ట్రాక్స్ కాకుండా అసలు కథతోనే పండించిన విధానం బాగుంది. ఇంకా ఇందులో ఓ సోషల్ మెసేజ్ ను కూడా పెట్టడం జరిగింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా పనిచేయడం సమాజానికి ఎంత అవసరమో ఈ చిత్రం లో కనపడుతుంది. సెకండాఫ్‌లో హీరో, అతడి తండ్రి మధ్యన వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉంటూ బాగా ఆకట్టుకున్నాయి. రావు రమేష్, సత్య రాజ్‌ల స్థాయికి తగ్గ నటన లాంటివి సినిమాకు బలాన్నిచ్చే అంశాలు. ఇక హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ఇబ్బందిగా కనిపించింది. పాటలు సినిమా కథ మధ్యలో మూడ్‌ను దెబ్బతీయడమే కాకుండా బోరింగ్‌గా వున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో పాటలు అన్నీ అసందర్భంగానే రావడం ఈ చిత్రానికి మైనెస్. అలాగే రాశి ఖన్నా పాత్ర సెకండాఫ్‌లో పూర్తిగా కనిపించకుండా పోవడం లాంటివి, మిగతా నటీనటులను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం లో దర్శకుడి లోపం కనిపిస్తుంది. ఇక చివరాఖరికి చెప్పేదేటంటే…పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్, లాజిక్ లు, కథను పక్కన పెడితే వినోదం అందించడంలో ఈ ‘హైపర్’ ఓకె….
తెలుగు360.కామ్ రేటింగ్ 2.5/5
బ్యానర్ : 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌,
నటీనటులు: రామ్‌, రాశి ఖన్నా, సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు..ప్రత్యేక పాత్రల్లో కె.విశ్వనాధ్, పోసాని కృష్ణ మురళి, మరియు సాయాజీ షిండే.
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి,
సంగీతం: జిబ్రాన్‌,
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: మణిశర్మ,
ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా,
ఎడిటింగ్‌: గౌతంరాజు,
మాటలు: అబ్బూరి రవి,
లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా,
సమర్పణ: వెంకట్‌ బోయినపల్లి,
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌,
విడుదల తేదీ: 30.09.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com