కియా ముందు నిరసనలా..? జగనా.. నీకిది తగునా..?

అనంతపురం జిల్లాలోని కియా పరిశ్రమ ముందు మహాధర్నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలనే డిమాండ్ చేస్తూ ఈ మహాధర్నా చేపట్టారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు ఇవ్వాలన్న డిమాండ్ పైకి చెబుతున్నా.. ఆ చుట్టుపక్కల రైతుల్ని రెచ్చగొట్టే వ్యూహం ఈ ధర్నాలో ఉంది. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లన్నింటినీ ఈ పరిశ్రమకు తరలిస్తున్నారని… రైతులకు నీళ్లు అందడం లేదని.. అక్కడ భూములన్నీ బీడు పడిపోయాయన్న రీతిలో.. వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ మహాధర్నా వెనుక రాజకీయ ఉద్దేశం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభమైన సమయంలో .. కియా పరిశ్రమకు వ్యతిరేకంగా రాజకీయ ఆందోళనలు చేపడితే.. రాష్ట్ర పారిశ్రామిక ఇమేజ్‌పై… మరక పడుతుందని… ప్రభుత్వ వర్గాలు ఆందోళనతో ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం.. జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులను తరలించి.. ఓ రకంగా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేలా మహాధర్నా చేయబోతున్నారని.. అనంతపురంలో ప్రచారం జరుగుతోంది.

అనంతపురం జిల్లాలో ప్రస్తుతం.. కియా రాక ముందు.. కియా వచ్చిన తర్వాత.. అన్నట్లుగా.. పరిస్థితులు మారిపోయాయి. పెనుకొండ ఏరియాలో పరిశ్రమ వచ్చినా.. అ ప్రభావం జిల్లా మొత్తం కనిపిస్తోంది. భూముల ధరలు.. రెండేళ్లలోనే.. రెండింతలు, మూడింతలు అయ్యాయి. ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. వర్షాభావం ఉన్నప్పటికీ.. కృష్ణా జలాలను.. గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా జిల్లాకు అందించారు. అనంతపురంలో ఇప్పటి వరకూ.. ఓ భారీ పరిశ్రమ అంటూ లేదు. కానీ.. ఇప్పుడు.. ప్రపంచంలోనే దిగ్గజంగా ఉన్న కార్ల పరిశ్రమ వచ్చింది. ఇప్పుడీ పరిశ్రమకూ.. నిరసనల సెగ తగిలేలా చేయడం ఎంత వరకు సమంజసం..!

భారతి సిమెంట్స్ లో పని చేస్తున్న వారిలో ఎంత మంది స్థానికులు ఉన్నారు..? భారతీ సిమెంట్స్ కు వినియోగిస్తున్న నీటిని పొలాలకు ఎందుకు ఉపయోగించకూడదు..? . సాక్షి పత్రికలో.. ఆయా జిల్లాల్లో పని చేస్తున్న వారు ఎంత మంది స్థానికులు..?. జగన్ సంస్థల్లో ఇచ్చిన ఉద్యోగాల శాతంతో పోలిస్తే.. కియా ఎక్కువగా స్థానికలుకే చాన్సిచ్చింది. ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి మరీ ఉద్యోగాలకు ఎంపిక చేసకుంది. టెక్నికల్‌గా హై స్కిల్డ్ ఉద్యోగాలు, మేనేజ్‌మెంట్… తదితరల్లాంటివి కోసం అనుభవజ్ఞులను తెచ్చుకున్నా… ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించింది. ఇక నీరు ఇస్తేనే ఆ పరిశ్రమ వచ్చిందనే సంగతి మర్చిపోకూడదు. ఏ పరిశ్రమకైనా నీరు ముఖ్యం. ఆ నీటితో రైతులు పంటలు పండించుకోవచ్చు కదా.. అని అనుకుంటే.. భారతీ సిమెంట్స్ కూడా నడవదు. వైసీపీ చేస్తున్న ఈ ఆందోళనల వల్ల… అనుబంధ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలు రాకుండా.. ఆగిపోతే.. ఆ నష్టం… అనంతపురానికే కానీ.. జగన్‌కు కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close