కొత్తపలుకు : ఒక వర్గం ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే పనిలో జగన్..!

ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ వేమూరి రాధాకృష్ణ… తన వారాంతాపు ఆర్టికల్‌ “కొత్త పలుకు”లో ఏదైనా సూటిగా సుత్తి లేకుండా చెబుతారు. మొహమాటలకు పోరు. కానీ ఈ సారి.. ఓ విషయాన్ని బలంగా చెప్పాలనుకున్నప్పటికీ.. మొహమాటానికి పోయారు. కేవలం.. ఒకే ఒక్క పదం.. ఒక్కే లైన్‌తో ఆ మాటను..అదీ చిట్టచివరన సరిపెట్టారు. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు… కాంట్రాక్టుల రద్దు లాంటి వ్యవహారాలన్నీ.. ఓ వర్గం ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడానికేనన్నట్లుగా “కొత్త పలుకు”లో వేమూరి రాధాకృష్ణ విశ్లేషించారు.

పోలవరం ప్రాజెక్ట్‌పై చేస్తున్న ప్రచారమేంటి..? ప్రభుత్వం చేసిందేమిటి..?

పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ రద్దు విషయంలో అసలేం జరిగిందో.. వేమూరి రాధాకృష్ణక్లారిటీ ఇచ్చారు. అవినీతి పేరుతో ప్రభుత్వం.. హడావుడి చేసి.. నవయుగకు టెర్మినేషన్ నోటీసులు ఇచ్చింది. కానీ.. ప్రభుత్వం కేవలం “ప్రభుత్వ సౌకర్యం కోసం” అనే ప్రధానమైన కారణంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి వైదొలగాలని నవయుగను ఆదేశించింది. ఈ ప్రభుత్వ సౌకర్యం కోసం అనే నిబంధన… అన్ని కాంట్రాక్టుల్లోనూ ఉంటుందని… ఏ దారి లేనప్పుడు మాత్రమే.. ప్రభుత్వాలు.. ఎలాగైనా ఇష్టం లేని కాంట్రాక్టర్లను తొలగించాలనుకుంటే..,ఈ దారిని ఎంచుకుంటాయన్నట్లుగా.. వేమూరి రాధాకృష్ణ విశ్లేషించారు.

పన్నుల వినియోగంపై “నిజమే కదా”.. అనిపించే విశ్లేషణ..!

ఇప్పుడు దేశంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అటు రైతు బలవన్మరణం చెందుతున్నాడు. ఇటు కార్పొరేట్లూ.. అదే పని చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది..? ప్రభుత్వాల బాధ్యత ఎంత..? అన్నదానిపై వేమూరి రాధాకృష్ణ…తన అభిప్రాయాల్ని సూటిగానే వినిపించారు. ” కష్టపడి వ్యాపారం చేసి పన్నులు కట్టేవారి వల్లనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కడుతున్న పన్నులతో రాజకీయ పార్టీలు అడ్డమైన హామీలు ఇస్తున్నాయి. సంక్షేమం పేరిట ప్రభుత్వాలు ఈ నిధులన్నీ వాడేస్తున్నారు. ఎంతమంది రాజకీయ నాయకులు పన్ను కడుతున్నారు? ఎవరో శ్రమించి చెల్లించే పన్నులను తమ సొంత సొమ్ము అన్నట్టుగా పంచి పెట్టే హక్కు రాజకీయ నాయకులకు ఎక్కడిది? లాభాలు వచ్చినప్పుడు పన్నులు కట్టి, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నష్టాలు చవిచూసే వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను ప్రభుత్వాలు ఎందుకు ఆదుకోవు?..” అని వేమూరి రాధాకృష్ణ ప్రశ్నల వర్షం కురిపించారు. తరచి చూస్తే ఇది నిజమే. ఆదాయం ఉన్నప్పుడు పన్నులు వసూలు చేసిన.. సర్కార్… ఆదాయం లేనప్పుడు ఆదుకునే ప్రయత్నం ఎందుకు చేయదన్నది పన్నులు కట్టే వారిలో కామన్‌గా వచ్చే ఆలోచన.

పీఠాలు, మఠాలు పెట్టుకోవడం బెటరని ఆర్కే సహా..!

ఏబీఎన్ ఆర్కే… ఈ వారం “కొత్త పలుకు”లో ఇద్దరు స్వాములపై .. దృష్టి కేంద్రీకరించి… కథనం రాసినా.. దీని వెనుక లోతైన అర్థం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్వాముల చేతుల్లో ప్రభుత్వాలున్నాయని తేల్చేశారు. మంత్రులు, అధికారులు డమ్మీలైపోయారని నిర్దారించారు. అంతే కాదు.. సిద్ధార్థ ఆత్మహత్య వ్యవహారంతో లింక్ పెట్టి.. ఇక వ్యాపారాలు చేయడం దండగని.. నాలుగు మంత్రాలు నేర్చుకుని… పీఠమో.. మఠమో పెట్టుకోవడం మంచిదన్న సలహా కూడా ఇచ్చారు. ఈ ఫ్రస్టేషన్ ఆర్కేకి మాత్రమే.. సాధారణ ప్రజల్లోనూ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
మొత్తంగా… “కొత్త పలుకు”లో చరమ వాక్యం మాత్రం.. ఏపీలో జగన్ సర్కార్ లక్ష్యం ఏమిటో చెప్పి ముగించారు. అమరావతి నిర్మాణం నిలిపి వేత దగ్గర్నుంచి ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు మొత్తం చూసిన వారి.. అది వాస్తవమే కదా.. అని అనిపించక మానదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close