మన గ్యాస్ మనకే..! సీఎం గారు తేల్చి చెప్పి ఉంటారా..?

మన గ్యాస్ దోచుకుపోతున్నారని.. రిలయన్స్‌ను వదిలి పెట్టేదే లేదని.. మన గ్యాస్‌ కాపాడటానికి ప్రయత్నించినందుకే.. వైఎస్‌కు ప్రమాదం జరిగిందని.. గత పదేళ్ల కాలంలో చాలా సందర్భాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆయన మీడియాలో పుంఖానుపుంఖాలుగా రాశారు. మన గ్యాస్ మనకేనని ఆయన నినదించారు. కేజీ బేసిన్ ఎవడబ్బసొత్తు కాదని.. ఉద్యమించారు. ఇలా అనడానికి ప్రధాన కారణం రిలయన్స్ ఇండస్ట్రీసే. కేజీ బేసిన్‌లో రిలయన్స్ పెట్రోలియం వెలికితీత పనులు చేస్తోంది. అప్పనంగా తరలించుకు పోతున్నారన్న ఆరోపణల్ని వైసీపీ చేసింది. దానికి చంద్రబాబు, రామోజీరావు లాంటి వారికి ముడిపెట్టి కూడా.. కథనాలు ప్రచురించింది.. తాను నమ్మిన ఆధారాలను కూడా ప్రచురించింది.

ఇప్పుడు..జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. నేరుగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీనే ఆయనతో భేటీ కోసం.. తాడేపల్లి వచ్చారు. భేటీ అయ్యారు. అత్యంత గౌరవంగా.. వెండి జ్ఞాపికలు, శాలువాలతో సత్కరించి చర్చలు జరిపారు. అతిధికి ఆ మాత్రం సత్కరింపులు సహజమే. అందులోనూ.. దేశంలోనే అత్యంత ధనవంతుడు.. ప్రపంచ ధనవంతుల్లో ఒకరు అయిన వ్యక్తికి.. చాలా సహజమే. అయితే.. ఇక్కడ ముఖ్యమంత్రి.. గతంలో తాను చెప్పిన విధానాలకు కట్టుబడి… మన గ్యాస్ మన కోసం.. వాదన వినిపించారా లేదా.. అన్నదే కీలకం. కేజీ బేసిన్ సంపద మొత్తం రాష్ట్రానికే దక్కాలన్న ఆయన డిమాండ్‌ను.. రిలయన్స్‌కు వినిపించారా లేదా అన్నదే ముఖ్యం.

పైగా.. కేజీ బేసిన్‌ను.. చంద్రబాబు, రామోజీరావు అమ్ముకున్నారని.. గతంలో.. ఆయన ఆరోపించారు. తన మీడియాలోనూ రాయించారు . ఇప్పుడు ఆ ఒప్పందాలను బయటపెట్టే గొప్ప అవకాశం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ప్రజాసంపదనను అడ్డగోలుగా అమ్మేసిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిని బయట పెట్టే అవకాశం వచ్చింది. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తన పాత విధానాలకే కట్టుబడతారా..? లేక.. ప్రపంచ అత్యంత ధనవంతుడని.. సైలెంట్‌గా ఉండిపోతారా..? తాను ప్రవరించిన సూత్రాల ప్రకారం.. రాష్ట్ర ప్రయోజనాలను కాపడతారా..? కేసీ బేసిన్ సంపదను రాష్ట్ర ప్రయోజనాలకు అందించగలరా..? అన్నదే ముఖ్యం. తన తండ్రి మరణం వెనుక అంబానీ ఉన్నాడని.. జగన్ గతంలో ఆరోపించారు. దాని గురించి అడిగారో లేదో.. మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయన తండ్రి కాబట్టి.. తండ్రిని చంపారని గట్టిగా నమ్మిన వాళ్లు ఎదురొస్తే.. ఎలా వ్యవహరిస్తారని ఆయన ఇష్టం. కానీ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం. పట్టించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉరవకొండ రివ్యూ : మరోసారి పయ్యావుల కేశవ్‌కే కిరీటం

ఉరవకొండలో పయ్యావుల గెలిస్తే టీడీపీ ఓడిపోతుందన్న ఓ ప్రచారాన్ని ఆయన ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. కానీ పయ్యావుల రాజకీయాల్లోకి వచ్చిన 1994లో టీడీపీ విజయం సాధించింది. పయ్యావుల కూడా గెలిచారు. ఆ తర్వతా...

చెల్లిని కించపర్చి జాతీయ మీడియాలో జగన్ నవ్వులపాలు

జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా...

పోస్టల్ బ్యాలెట్స్ కూడా రీపోలింగ్ – ఇదేం ఎన్నికల నిర్వహణ ?

ఎన్నికల నిర్వహణ ఎంత అసమర్థుల చేతుల్లో ఉందో తెలిపే ఘటన ఇది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఉద్యోగులకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు. రోజంతా ఉద్యోగులు కష్టపడి...

రైతు భరోసా స్టార్ట్ … క్రెడిట్ బీఆర్ఎస్ దేనా..?

రైతు భరోసాకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కేసీఆర్ తనదైన రాజకీయం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల వేళ పెట్టుబడి కింద రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతుండటంతో ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ఖాతాలో వేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close