వాలంటీర్లను వదిలించుకునే ప్రయత్నంలో సీఎం జగన్ ?

వాలంటీర్లను ఇంత కాలం ఉపయోగించుకున్న జగన్… ఎన్నికలకు ముందు వారినందర్నీ వదిలించుకుంటారన్న చర్చ జరుగుతోంది. అందు కోసం.. ఒక్క వాలంటీర్ కు పార్టీ తరపున ఇద్దరు గృహసారధుల్ని పెట్టారని ..అంటున్నారు. వాలంటీర్లను వైసీపీ అధినేత జగన్ ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ.. దానికి రివర్స్ లో ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయంటున్నారు. అందుకే గ్రామ వాలంటీర్ల విషయంలో వైఎస్ఆర్‌సీపీ గతంలో ఎన్నడూ లేనంత టెన్షన్ పడుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఇటీవలి కాలంలో జరుగుతున్న సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్ల సమావేశాల్లో మంత్రులు… ఇతర ముఖ్య నేతలు చేస్తున్న కామెంట్లు కూడా వాలంటీర్ల విషయంలో వైఎస్ఆర్‌సీపీ ఆందోళన చెందుతున్న అభిప్రాయాలన్ని కల్పిస్తున్నాయి. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు వాలంటీర్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా వాలంటీర్లకు క్లాస్ పీకుతున్నారు. పథకాలు ఎవరు ఇస్తున్నారంటే జగన్ ఇస్తున్నారని చెప్పాలని అంటున్నారు. పథకాలు ఇవ్వాలన్నా.. తీసేయాలన్నా వారి చేతుల్లోనే ఉంది. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వం గురించి.. జగన్ గురించి చెప్పడం తక్కువైపోయిందన్న అనుమానం పార్టీ నేతల్లో బలపడుతోంది.

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైఎస్ఆర్‌సీపీ నేతలు నిర్వహిస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా పథకాలు ఎవరు ఇస్తున్నారు అంటే.. వాలంటీర్ ఇస్తున్నారని చెప్పేవాళ్లే ఎక్కువ. దీంతో వాలంటీర్లు మరీ చేతికి అందకుండా పోతున్నారని కొత్తగా గృహసారధుల్ని జగన్ నియమించమని పార్టీ నేతలను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. వాలంటీర్లు చేస్తున్న అంతర్గత రాజకీయానికి తోడు వారిలో కొంత మంది చేస్తున్న నిర్వాకాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఓ వాలంటీర్ పెన్షన్ కు బదులుగా దొంగ నోట్లను పంపిణీ చేశాడు. మరో వాలంటీర్ పప్పుల చిటీల పేరుతో జనాల్ని మోసం చేసి ఉడాయించింది. మరో వాలంటీర్ పెన్షన సొమ్ముతో పరారయ్యాడు. ఇలా వాలంటీర్ల గురించి వచ్చే వివాదాలు అన్నీ ఇన్నీ కావు. వీటి విషయంలోనూ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల్ని నియమించింది. వాటి వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వం ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు వాలంటీర్లను నియమించింది. వారి వల్ ప్రతీ ఇల్లూ ప్రత్యక్షంగా ఇబ్బందులు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు వదిలించుకోవడంపై దృష్టి పెట్టారన్న చర్చ జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close