బాలీవుడ్‌కి వెళ్తున్న జ‌గ‌ప‌తిబాబు

లెజెండ్‌తో త‌న రూటు మార్చేశాడు జ‌గ్గూభాయ్‌. ఆ సినిమా త‌న‌కి మ‌రో లైఫ్ ఇచ్చింది. అక్క‌డి నుంచి ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు పాత్ర‌లు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అప్పుడ‌ప్పుడు త‌మిళ చిత్ర‌సీమ‌కూ వెళ్లివ‌స్తున్నాడు. ఇప్పుడు జ‌గ్గూభాయ్‌కి బాలీవుడ్ ఆఫ‌ర్ ద‌క్కింది. త్వ‌ర‌లోనే ఓ హిందీ చిత్రంలో మెర‌వ‌బోతున్నాడు జ‌గ‌ప‌తిబాబు. ఈ విష‌యాన్ని జ‌గ్గూభాయ్ స్వ‌యంగా వెల్ల‌డించారు. “ఎప్ప‌టి నుంచో బాలీవుడ్‌లోఓ సినిమా చేయాల‌ని ఆశ‌. అది ఇప్పుడు తీరింది. ఈ అవ‌కాశం తెచ్చిపెట్టింది కూడా రంగ‌స్థ‌లంలోని ప్రెసిడెంట్ పాత్రే. నా కెరీర్‌లోనే అత్యుత్త‌మ పాత్ర రంగ‌స్థ‌లంలో చేశా. బాలీవుడ్ చిత్రానికి సంబంధించిన విష‌యాలు త్వ‌ర‌లో చెబుతా“ అన్నాడు జ‌గ్గూభాయ్‌. మ‌రి బాలీవుడ్‌లో కూడా జ‌గ్గూభాయ్ విల‌న్‌గానే క‌నిపిస్తాడో, లేదంటేఅంత‌కు మించిన పాత్ర‌లో షాక్ ఇస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close