జెఎఫ్ సి నివేదిక (పార్ట్ 1): రాష్ట్ర ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిన అంశాలు ఇవే.

మొత్తానికి జెఎఫ్ సి నివేదిక వచ్చేసింది. జెపి, ఉండవల్లి తదితరులతో పవన్ కళ్యాణ్ ఏర్పాటుచేసిన ఈ కమిటీ ఇచ్చిన నివేదిక శాస్త్రీయమైన అధ్యయనంతో గణాంకాలతో ఉండి భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై జరిగే ఏ చర్చ కైనా అన్ని పార్టీలకు ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. అయితే మొత్తం 15 అంశాలపై అధ్యయనం చేసిన ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టులో దాదాపు అన్ని అంశాల్లోనూ కేంద్రాన్ని దోషిగా నిలబెట్టినప్పటికీ, నాలుగు అంశాలలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని వేలెత్తి చూపింది .

ఈ నాలుగు అంశాలు ఏమంటే పోలవరం, అమరావతి , దుగరాజపట్నం పోర్టు , విశాఖపట్నం మెట్రో. పోలవరం విషయంలో నేరుగా రిపోర్టులో పొందుపరచనప్పటికీ నివేదిక అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పోలవరం కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రాజెక్టు అని దాన్ని అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని , అలా తీసుకోకుండా ఉండి ఉంటే ఇప్పుడు పూర్తి కాక పోవడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కారణం అయ్యేదని కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని తన మీదకు నింద వచ్చేలా చేసుకుందని అభిప్రాయపడ్డారు .

అమరావతి విషయంలో మాత్రం రిపోర్టులో నేరుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వేలెత్తి చూపారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి డిజైన్లు కూడా ఖరారు చేయలేదని , అలాగే శాశ్వత నిర్మాణాలు మొదలు కూడా పెట్టలేదు అని విమర్శించారు . అలాగే,అమరావతి కి సంబంధించిన ఖర్చుల వివరాలు కూడా రాష్ట్రప్రభుత్వం ఇవ్వలేదని నివేదికలో చేర్చారు .

ఇక దుగరాజపట్నం పోర్టు విషయంలో కూడా నివేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టింది . కేంద్రం ప్రత్యామ్నయ ప్రాంతాన్ని చూపమని అడిగితే ఇప్పటికీ చూపించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు . వీలైనంత త్వరగా ఈ పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రత్యామ్నయ ప్రాంతాన్ని చూపాలని కమిటీ అభిప్రాయపడింది .

ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిన మరొక అంశం విశాఖపట్నం మెట్రో. ఈ మెట్రో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రపోజల్ పంపిందని , అయితే కేంద్రం దాన్ని తిరస్కరించిందని , ఆ తర్వాత మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పంపాల్సి ఉందని కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదు అని కమిటీ అభిప్రాయపడింది.

అయితే ఈ నాలుగు అంశాలు మినహాయించి మిగిలిన 11 అంశాలో కేంద్ర ప్రభుత్వాన్ని గణాంకాలతో సహా దోషిగా నిల బెట్టింది ఈ రిపోర్టు. వివరాలు తదుపరి ఆర్టికల్లో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

పాతబస్తీలో తగ్గిన పోలింగ్… టెన్షన్ లో అసద్..!?

హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో విజయంపై ఎంఐఎం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక్కడ కేవలం 46.08శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో మజ్లిస్ కంచుకోటలో బీజేపీ పాగా వేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close