వ‌ర్మ‌పై జొన్న‌విత్తుల బ్ర‌హ్మాస్త్రం

రాంగోపాల్ వ‌ర్మ – జొన్న‌విత్తుల మ‌ధ్య ఆమ‌ధ్య గ‌రం గ‌రంగా భేటీలు సాగాయి. ఇద్ద‌రూ ‘సై’ అంటూ క‌య్యానికి కాలు దువ్వుకున్నారు. ఎవ‌రినైనా ఇట్టే రెచ్చ‌గొట్టేసే టాలెంట్ ఉన్న వ‌ర్మ – జొన్న‌విత్తుల‌ను మీడియా సాక్షిగా ఓ ఆట ఆడుకున్నాడు. ‘వ‌ర్మ జోలికి వెళ్ల‌డం ఎందుకులే’ అనుకునే ఈరోజుల్లో వ‌ర్మ‌పై ఎర్ర‌జెండా ఎగ‌రేసి, నువ్వా? నేనా అంటూత‌ల‌ప‌డ్డాడు జొన్న‌విత్తుల‌. అదే స‌మ‌యంలో వ‌ర్మ‌పై ఓ సినిమా తీస్తాన‌ని, అత‌ని పైత్యం ఏపాటిదో ఈ జనానికి చెబుతాన‌ని ప్ర‌తిన బూనారు జొన్న‌విత్తుల‌. ఆ కోపాన్ని కేవ‌లం మాట‌ల‌తో స‌రిపెట్ట‌లేదు. సినిమాకి కొబ్బ‌రికాయ కూడా కొట్టేశారు. ఈ సినిమాకి ‘ఆర్జీవీ’ అనే పేరు కూడా పెట్టారు. నిజానికి ‘సైకో ఆర్టీవీ’ అనే టైటిల్ కోసం జొన్న‌విత్తుల ప్ర‌య‌త్నించారు. కానీ ఫిల్మ్‌ఛాంబ‌ర్ ఆ టైటిల్‌ని అనుమ‌తించ‌లేదు. దాంతో `ఆర్జీవీ`తో స‌రిపెట్టుకున్నారు జొన్న‌విత్తుల‌. స‌మాజంలో కొంత‌మంది వ్య‌క్తులు స్వేచ్ఛ పేరుతో స‌మాజాన్ని ఎలా త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారో ఇందులో చెబుతానంటున్నారు జొన్న‌విత్తుల‌. వ‌ర్మ వేష‌ధార‌ణ‌కు స‌రిపోయే ఓ న‌టుడిని వెదికి ప‌ట్టుకోవ‌డంలో బిజీగా ఉన్నారు జొన్న‌విత్తుల‌. ఈ సినిమాకి ఆయ‌నే క‌థ‌, మాట‌లు అందిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close