క‌మ‌ల్ వ‌చ్చేది క్లైమాక్స్‌లోనే..

బాహుబ‌లి, పుష్ష‌, కేజీఎఫ్‌…. ఇవ‌న్నీ రెండు భాగాలుగా వ‌చ్చిన సినిమాలే. ఈ ఫార్ములా బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ఆర్థికంగా అద్భుత‌మైన రిజ‌ల్ట్ ని తీసుకొచ్చాయి. ఇప్పుడు స‌లార్‌ని సైతం రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచ‌న ఉంది. ఈ జాబితాలో ప్రాజెక్ట్ కే కూడా చేరిపోయింది. అశ్వ‌నీద‌త్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని సైతం రెండు భాగాలుగా విడ‌గొట్టి, విడుద‌ల చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. తొలి భాగానికి సంబంధించిన షూటింగ్ దాదాపుగా 80 శాతం పూర్త‌య్యింది. 2024 జ‌న‌వ‌రిలో మొద‌టి భాగాన్ని విడుద‌ల చేస్తారు.

ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ కూడా న‌టిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1లో ముగింపులో.. క‌మ‌ల్ పాత్ర ఎంట్రీ ఇస్తుంద‌ని, ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్‌తోనే తొలి పార్ట్ కి ముగింపు ప‌డుతుంద‌ని స‌మాచారం. పార్ట్ 2లో క‌మ‌ల్ పాత్ర పూర్తి స్థాయిలో క‌నిపిస్తుంద‌ట‌. క‌మ‌ల్ తో పాటు… క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌ల‌కు చెందిన కొంత‌మంది అగ్ర న‌టులు సైతం పార్ట్ 2లో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కె రెండో భాగాన్ని 2025 సంక్రాంతికి విడుద‌ల చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close