క‌న్నా ముందున్న రెండు కీల‌క స‌వాళ్లు ఇవి..!

అటు తిరిగీ ఇటు తిరిగీ.. అనూహ్యంగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ పార్టీ అధ్య‌క్షుడిగా భాజ‌పా నియ‌మించిన సంగతి తెలిసిందే. నిజానికి, ఆ ప‌ద‌వి రేసులో చివ‌రి ఆప్ష‌న్ గా ఉంటూ వ‌చ్చిన క‌న్నా పేరుకి భాజ‌పా జాతీయ నాయ‌క‌త్వం టిక్ పెట్ట‌డం విశేషం! అధ్య‌క్ష ప‌ద‌వి రేసు నేప‌థ్యంలో ఏపీ నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న పోటీ వైఖ‌రి, సోము వీర్రాజుకు ఇస్తే ఒప్పుకునేది లేద‌నీ, త‌ప్పుకోవ‌డం త‌ప్ప‌దంటూ ఆకుల స‌త్య‌నారాయ‌ణ హెచ్చ‌రిక‌లు, ఆయ‌న‌కి వ్య‌తిరేకంగా కొంతమంది ఢిల్లీకి లేఖ‌లు… వెర‌సి కన్నాకు అవ‌కాశం రావ‌డం వెన‌క, ఆయ‌న‌ అర్హ‌త కంటే రాష్ట్రంలోని ప్ర‌త్యేక ప‌రిస్థ‌ితుల ప్ర‌భావ‌మే ఎక్కువ అన‌డంలో సందేహం లేదు. ఇక‌, రాష్ట్ర భాజ‌పా కొత్త అధ్య‌క్షుడిగా క‌న్నాముందు రెండు ప్ర‌ధాన‌ స‌వాళ్లున్నాయి.

మొద‌టిది ఇంటిపోరు..! త‌న‌కే అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని సోము వీర్రాజు చాలా ఆశ‌లు పెట్టేసుకున్నారు. ఆయ‌న‌తోపాటు మాజీ మంత్రి పైడికొండ‌ల‌ మాణిక్యాల‌రావుకి కూడా ప‌ద‌వి వ‌స్తుంద‌న్నారు. ఒక ద‌శ‌లో పురంధేశ్వ‌రి పేరు కూడా వినిపించింది. అయితే, వీరంతా ఇప్పుడు క‌న్నాకు స‌హ‌క‌రిస్తారా అనేది ప్ర‌శ్న‌..? ఎందుకంటే, టీడీపీతో పొత్తులో ఉండ‌గా, ఏపీ భాజ‌పా నేతలుగా వీరంతా ‘త‌మకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రాధాన్యత ఇవ్వ‌డం లేదంటూ’ త‌ర‌చూ ఢిల్లీ నాయ‌క‌త్వానికి ఫిర్యాదు చేసేవారు. అప్ప‌ట్లో టీడీపీతో మంచి దోస్తీ ఉండేది కాబ‌ట్టి, ఆ ఫిర్యాదుల‌ను భాజపా అధిష్టాన‌మూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కేంద్ర అవ‌స‌రాలన్నింటినీ వ‌యా వెంక‌య్య నాయుడు ద్వారా చంద్ర‌బాబు నాయుడు చ‌క్క‌బెట్టుకునేవారు. రాష్ట్ర భాజ‌పా నేత‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదు! ఆ ద‌శ‌లో రాష్ట్రంలోని టీడీపీతో కొంత నిర‌స‌న వాతావ‌ర‌ణాన్ని ఎదుర్కొంటూ, అధిష్టానం త‌మ గోడును ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేద‌న్న రీతిలో తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసేవారు. ఉనికి కోసం పోరాటం చేసేవార‌న‌డం క‌రెక్ట్‌. అలాంటి స‌మ‌యంలో కూడా పార్టీకి అండ‌గా నిలుస్తూ వ‌చ్చిన త‌మ‌ను కాద‌ని, పార్టీ వ‌దిలి వెళ్లిపోయేందుకు సిద్ధ‌మైన క‌న్నాకు అవ‌కాశం ఇవ్వ‌డంపై కొంత అసంతృప్తి వీరిలో క‌చ్చితంగా ఉంటుంది. ఇలాంటి వాతావ‌ర‌ణం మ‌ధ్య‌లో క‌న్నా ప‌నిచేయాల్సి ఉంటుంది.

ఇక‌, రెండోది రాష్ట్రంలో భాజ‌పాపై ప్ర‌జా వ్య‌తిరేక‌త‌. ఎన్డీయే నుంచి టీడీపీ విడిపోయాక కేంద్ర వాద‌న‌ను క‌న్నా ఇంత‌వ‌ర‌కూ బ‌లంగా వినిపించిన దాఖ‌లాలు లేవు. సోము వీర్రాజు రేంజిలో టీడీపీపై విమ‌ర్శ‌లూ చేయ‌లేదు. ఇక‌, రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఆ ప‌ని ఆయ‌న‌కి త‌ప్ప‌దు. పైగా, రాష్ట్రంలో భాజ‌పాపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌నేది వాస్త‌వం. ప్ర‌త్యేక‌హోదా, విభ‌జ‌న హామీల విష‌యంలో ఆంధ్రాని భాజ‌పా నిలువునా ముంచింద‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉంది. దీంతో ఇత‌ర పార్టీలు కూడా ఎన్నిక‌ల ముందు భాజ‌పాతో పొత్తుకు భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి. ఇప్పుడు, పార్టీ అధ్య‌క్షుడిగా ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను క‌న్నా డీల్ చేయాల్సి ఉంటుంది. పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ క‌న్నాను ఒక భాజ‌పా నేత‌గానో, అడ్డ‌గోలుగా కేంద్ర వాద‌నను రాష్ట్రంపై రుద్దే నాయ‌కుడిగానో ప్ర‌జ‌లు చూడ‌లేదు. ఇక‌పై, ఆ ముద్ర‌ను కూడా వేయించుకోవ‌డానికి క‌న్నా సిద్ధంగా ఉండాలి. ఈ నేప‌థ్యంలో ఆంధ్రాలో అత్యంత ప్ర‌తికూల ప‌రిస్థితుల మ‌ధ్య భాజ‌పాని విస్త‌రింప‌జేయ‌డం అనేది క‌న్నా ముందున్న పెద్ద స‌వాల్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close